Bright Telangana
Image default

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవం

ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ : సీఎం కేసీఆర్‌ కూతురు, సిటింగ్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి ఎమ్మెల్సీ అయ్యారు. నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల అభ్యర్థిగా మళ్లీ పోటీ చేసిన ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది. స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్ నామినేషన్ తిరస్కరించడంతో కవిత ఎన్నిక ఏకగ్రీవమైంది. టీఆర్‌ఎస్‌ తరఫున సిట్టింగ్‌ ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ పంచాయతీరాజ్‌ చాంబర్‌ తరఫున ఆర్మూర్‌ నియోజకవర్గం మాక్లూర్‌ మండలం అమ్రాద్‌ గ్రామానికి చెందిన కోటగిరి శ్రీనివాస్‌ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే స్వతంత్ర అభ్యర్థిపై ఫోర్జరీ ఆరోపణలు రావడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. మంగళవారం ఆమె నామినేషన్‌ దాఖలు చేయగా.. ఒక్కరోజు గ్యాప్‌లోనే ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవమైనట్లు ప్రకటన వచ్చేసింది.

కాగా.. కవిత ప్రస్తుత మండలి సభ్యత్వం త్వరలో ముగియనుండగా.. మళ్లీ ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు ఆమె ఆసక్తి చూపడంలేదనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల రాజ్యసభ సభ్యుడు బండా ప్రకా‌ష్‌ను ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీఎం కేసీఆర్‌ ఖరారు చేయడంతో.. ఆయన స్థానంలో కవితను ఢిల్లీకి పంపిస్తారనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఇందుకు తగ్గట్టుగానే నిజామాబాద్‌ స్థానానికి సిటింగ్‌ ఎమ్మెల్సీ ఆకుల లలిత పేరు వినిపించింది. కానీ, టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఊహాగానాలకు తెరదించుతూ.. నిజామాబాద్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మళ్లీ కవిత పేరునే ఖరారు చేసింది.

Related posts

CM KCR: రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చేస్తే.. ఊరుకోం.. పోరాడతాం.. సీఎం కేసీఆర్

Hardworkneverfail

Minister KTR: బండి సంజయ్‌ కాదు.. తొండి సంజయ్‌..

Hardworkneverfail

వనపర్తిలో బాలికపై ఇద్దరు వ్యక్తుల అత్యాచారం..

Hardworkneverfail

నిజామాబాద్‌లో చిన్నారి కిడ్నాప్‌ కలకలం

Hardworkneverfail

హిమాన్షుపై వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న.. కేసు పెట్టిన కేటిఆర్…!

Hardworkneverfail

దళితబంధు పథకాన్ని కూడా కేసీఆర్‌ అటకెక్కిస్తారేమో.. డీకే అరుణ విమర్శలు..

Hardworkneverfail