Bright Telangana
Image default

Bangarraju Teaser : నవ ‘మన్మథుడు’ వచ్చాడు.. ‘చిన్న బంగార్రాజు’ గా నాగ చైతన్య..

బంగార్రాజు movie

అక్కినేని నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయనా మూవీ ఎంత హిట్టో అందరికీ తెలిసిందే! ఈ మూవీకి ప్రీక్వెల్‌ అయిన బంగార్రాజుతో హిట్‌ కొట్టడానికి రెడీ అవుతున్నాడు నాగార్జున. ఇందులో నాగచైతన్య మరో హీరోగా నటిస్తున్నారు. ఆయనకు జోడిగా కృతి శెట్టి కథానాయికగా నటిస్తుంది. ‘బంగార్రాజు’ మూవీలో ఏయన్నార్‌ని గుర్తు తెచ్చేలా నాగార్జున గెటప్‌ను డిజైన్‌ చేశారు ఈ దర్శకుడు కల్యాణ్‌కృష్ణ. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్‌ రిలీజైంది.

అక్కినేని నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం ‘బంగార్రాజు’ టీజర్ విడుదల చేశారు. ఇందులో చైతూ.. నాగార్జున తరహాలోనే మెరిసిపోతున్నాడు. ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాకు ఈ చిత్రం ప్రీక్వెల్ కావడంతో అంతా నాగార్జునే ‘బంగార్రాజు’గా కనిపిస్తారని అనుకున్నారు. కానీ, టీజర్ చూసిన తర్వాత.. చిన్న బంగార్రాజుగా చైతూ కనిపించనున్నాడని తెలుస్తోంది.

టీజర్ లో నాగ చైతన్య ఎంట్రీ అదిరిపోయింది. బంగార్రాజు ఫోటో వద్ద ఉన్న కళ్ళజోడు, రింగ్స్, చైన్ వేసుకొని దసరా బుల్లోడుగా బైక్ పై బయల్దేరాడు చిన్న బంగార్రాజు.. పేరును బట్టి చైతూ బంగార్రాజు మనవడిగా కనిపించనున్నట్లు అర్ధమవుతుంది. అచ్చు గుద్దినట్లు తాత బంగార్రాజును కాపీ కొడుతున్నట్లు కనిపించింది. ప్రస్తుతం ఈ టీజర్ వైరల్ గా మారింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే విడుదలకు సిద్ధం అవుతుంది.

Related posts

Gully Rowdy: ‘గల్లీ రౌడీ’ మూవీ ఓటీటీలోకి ఎప్పుడంటే?

Hardworkneverfail

Varudu Kaavalenu: ‘వరుడు కావలెను’ మూవీ 2 వీక్స్ కలెక్షన్స్

Hardworkneverfail

Chiranjeevi : రావుగోపాలరావు వాయిస్‌ని అనుకరించిన మెగాస్టార్ చిరంజీవి..

Hardworkneverfail

Acharya: చిరంజీవి అభిమానులకు గుడ్‌న్యూస్‌.. ‘ఆచార్య’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Hardworkneverfail

Bigg Boss 5 Telugu : నాగార్జున సపోర్ట్‌తో షణ్ముఖ్‌పై రివెంజ్‌ తీర్చుకున్న రవి..

Hardworkneverfail

MAA Elections: ‘మా’ ఎన్నికల్లో వైకాపా జోక్యం.. ప్రకాశ్‌రాజ్‌

Hardworkneverfail