Bright Telangana
Image default

Pushpa Tamil Rights: ‘పుష్ప’ మూవీ తమిళ్‌ రైట్స్‌ను భారీ రేటుకి సొంతం చేసుకున్న లైకా ప్రొడక్షన్స్‌

Introducing Pushpa Raj : పుష్ప రాజ్ హవా మామూలుగా లేదే

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి కొన్ని ఆసక్తికర అప్డేట్లను విడుదల చేసి ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని పెంచేశాయి. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదలైన పాటలు అదరగొడుతున్నాయి. ఈ పాన్ ఇండియన్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని – వై. రవి శంకర్ నిర్మిస్తున్నారు. ముత్యం శెట్టి మీడియా వారు నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నారు. తెలుగు హిందీ తమిళం మలయాళం కన్నడ భాషల్లో డిసెంబర్ 17న ఈ మూవీని విడుదల చేయనున్నారు.

ఇక పుష్పను హిందీలో గోల్డ్ మైన్స్ కంపెనీ విడుదల చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వినిపించగా… తమిళంలో లైకా ప్రోడక్షన్స్ భారీగా విడుదల చేయబోతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైంది. లైకా ప్రొడక్షన్స్ ఈ మూవీ తమిళ థియేట్రికల్ హక్కులను రూ.7 కోట్లకు సొంతం చేసుకున్నట్టు తాజా సమాచారం. ఇప్పటికే లైకా సంస్థ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ తమిళ హక్కులను కూడా చేజిక్కించుకుంది. ఇప్పుడీ ‘పుష్ప’ తమిళ వెర్షన్ ను తమిళనాట భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అల్లు అర్జున్ కి తమిళనాట కూడా మంచి క్రేజ్ ఉండడంతో భారీ ఓపెనింగ్స్ వుంటాయని భావిస్తున్నారు.

Related posts

Pushpa Movie: ‘పుష్ప’ మూవీ స్పెషల్ సాంగ్ నుంచి సమంత సిజ్లింగ్ పోస్టర్ రిలీజ్..

Hardworkneverfail

Pushpa Collection : ఊర మాస్ కలెక్షన్స్.. ‘పుష్ప’ మూవీ 3 డేస్ కలెక్షన్స్

Hardworkneverfail

Pushpa Trailer update: అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీ ట్రైలర్ వచ్చేది ఆ రోజే..!

Hardworkneverfail

Unstoppable with NBK : బాలయ్యతో సందడి చేసిన ‘పుష్ప’ టీమ్

Hardworkneverfail

Pushpa Collection : ‘పుష్ప’ మూవీ 2 డేస్ కలెక్షన్స్ .. రచ్చ మాములుగా లేదుగా

Hardworkneverfail

Pushpa Movie Collections : ‘పుష్ప’ మూవీ 18 డేస్ టోటల్ కలెక్షన్స్ ..

Hardworkneverfail