Bright Telangana
Image default

MLA Roja: ఇప్పుడు చంద్రబాబుకి తగిన శాస్తి తగిలింది.. ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నా..ఎమ్మెల్యే రోజా

ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నా..ఎమ్మెల్యే రోజా

ఆంధ్రప్రదేశ్ : విధి ఎవరినీ విడిచిపెట్టదనీ, అందరి సరదా తీర్చేస్తుందనీ, ఇప్పుడు చంద్రబాబుకు అదే జరిగిందని కామెంట్‌ చేశారు ఎమ్మెల్యే రోజా. చంద్రబాబు దొంగ ఏడుపు ఏడ్చారని నగరి ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వంలో తనను ఘోరంగా అవమానించారని ఇప్పుడు ఆ పాపం పండిందని ఎద్దెవా చేశారు. తనతో పాటు ఎందరో మహిళలను అవమానించిన చంద్రబాబుకు ఇప్పుడు తగిన శాస్తి తగిలిందన్నారు. రూల్స్‌కు విరుద్ధంగా తనను సంవత్సరం పాటు సస్పెండ్ చేసిన బాబుకు ఇప్పుడు రూల్స్‌ గుర్తుకొస్తున్నాయా అని రోజా మండిపడ్డారు.

ఈ రోజు దొంగ ఏడుపులు ఏడ్చే చంద్రబాబును ఎవ్వరూ పట్టించుకోట్లేదని రోజా అన్నారు. చంద్రబాబు.. ఈ రోజు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. నీ కోసం 10 సంవత్సరాలు పని చేసిన లీడర్‌గా చూడకుండా.. మహిళ అని చూడకుండా నన్ను మానసిక క్షోభకు గురిచేసిన నువ్వు.. నీకు నువ్వే సరైన శిక్ష వేసుకున్నావు అని అన్నారు. రెండున్నరేళ్లు కాదు కదా మళ్లీ జీవితంలో అసెంబ్లీకి రాలేవన్నారు. బైబై బాబు.. బైబై అంటూ రోజా సంతోషం వ్యక్తం చేశారు.

Related posts

AP Minister Mekapati Goutham Reddy Passes Away : ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కన్నుమూత..

Hardworkneverfail

Nandamuri Balakrishna: వైసీపీ నేతలకు బాలకృష్ణ వార్నింగ్..

Hardworkneverfail

AP Rain Alert: ఏపీని వదలని వానలు..బంగాళాఖాతంలో నేడు మరో అల్పపీడనం

Hardworkneverfail

Bharat Bandh : దేశ వ్యతిరేక విధానాలకు నిరసనగా నేడు, రేపు భారత్ బంద్ ..

Hardworkneverfail

పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నాడు..?

Hardworkneverfail

AP New Districts : ఏపీలో వేగంగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ

Hardworkneverfail