Bright Telangana

Apple iPhone 13 : 5జీ ఐఫోన్ -13 ఆవిష్కరించిన యాపిల్

యాపిల్ సరికొత్త 5G ఐఫోన్ 13 సిరీస్ ను ఆవిష్కరించింది. ఐఫోన్ మినీ, ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్ లను… అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫోన్లన్నీ తాజా A15 బయానిక్ ప్రాసెసర్ తో వచ్చినట్లు….. యాపిల్ సంస్థ వెల్లడించింది. ఈ నూతన వెర్షన్ లో గత ఏడాది విడుదల చేసిన ఐఫోన్ 12 కంటే….. రెండు రెట్లు అధిక స్టోరేజీని కల్పించినట్లు పేర్కొంది. ఐఫోన్ 12తో పోల్చుకుంటే…కొత్త వెర్షన్ ఫోన్లలో బ్యాటరీ సామర్థ్యం….. దాదాపు గంటన్నర నుంచి రెండున్నర గంటలు అధికంగా ఉంటుందని వివరించింది. యాపిల్ ఐఫోన్ లలో….. ఇటీవల భద్రతాపరమైన లోపాలు బయటపడిన నేపథ్యంలో వాటిని దృష్టిలో ఉంచుకుని….. ఈ ఐఫోన్ లో కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలు పాటించినట్లు పేర్కొంది. ..