Bright Telangana
Image default

T20 World Cup Final: ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం..

న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం

టీ 20 ప్రపంచ కప్ 2021 ఫైనల్‌ : దుబాయ్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. తొలిసారి టీ 20 వరల్డ్ కప్‌ సాధించింది. 173 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేక కివీస్ బౌలర్లు చేతులెత్తేశారు. ఆస్ట్రేలియా ఈ లక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలో ఛేదించింది.

మిచెల్‌ మార్షల్ 77 పరుగులతో జట్టును విజయ తీరాలకుచేర్చాడు. 50 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. డేవిడ్‌ వార్నర్ అర్ద సెంచరీతో(38 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 పరుగులు) అదరగొట్టాడు. గ్లెన్ మాక్స్‌వెల్ 28 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో బోల్ట్‌ రెండు వికెట్లు తీయగా మిగతా వారు ఎవ్వరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.

అంతకు ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కి దిగిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన మార్టిన్ గప్టిల్ (28), డారిల్ మిచెల్ (11) భారీ భాగస్వామ్యాన్ని అందించడంలో విఫలమయ్యారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన కేన్ విలియమ్సన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కేవలం 48 బంతుల్లోనే 85 పరుగులు సాధించి, ఫైనల్లో మరోసారి తన బ్యాటింగ్ పవర్ చూపించాడు. ఇందులో 10 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. గ్లెన్ ఫిలిప్స్(18) కూడా ఫైనల్ మ్యాచులో ఆకట్టుకోలేక పోయాడు. చివరలో జేమ్స్ నీషమ్ 13, టిమ్ సీఫెర్ట్ 8 పరుగులతో చివరిదాక క్రీజులో ఉండి మరో వికెట్ పడకుండా టీం స్కోర్‌ను 172 పరుగులకు చేర్చారు.ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్ 3 వికెట్లు, ఆడం జంపా ఒక వికెట్ తీశారు తీశాడు.

ఆస్ట్రేలియా ఇప్పటివరకు వన్డే ఫార్మాట్లో ఐదుసార్లు వరల్డ్ కప్ గెలిచింది. తాజాగా టీ20 ఫార్మాట్లో తొలిసారిగా విజేతగా నిలిచింది. ఇక, 2019లో వన్డే వరల్డ్ కప్ ను తృటిలో చేజార్చుకున్న న్యూజిలాండ్… ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ లోనూ నిరాశే ఎదురైంది.

ఈ మెగా టోర్నీ టైటిల్ నెగ్గిన ఆస్ట్రేలియా జట్టుకు రూ.11.89 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. రన్నరప్ గా నిలిచిన న్యూజిలాండ్ జట్టుకు రూ.5.9 కోట్లు దక్కాయి.

Related posts

T20 World Cup 2021: 52 పరుగుల తేడాతో నమీబియా పై న్యూజిలాండ్ ఘన విజయం…

Hardworkneverfail

T20 World Cup 2021: స్కాట్లాండ్‌‌ పై 130 పరుగుల భారీ తేడాతో అప్ఘానిస్తాన్ ఘన విజయం

Hardworkneverfail

T20 World Cup 2021: శ్రీలంక పై ఇంగ్లండ్‌ ఘన విజయం..!

Hardworkneverfail

T20 World Cup 2021 : ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ విజయం…

Hardworkneverfail

T20 World Cup 2021: స్కాట్లాండ్‌ పై న్యూజిలాండ్ విజయం…

Hardworkneverfail

T20 World Cup 2021: 20 రన్స్ తేడాతో వెస్టిండీస్ పై శ్రీలంక గెలుపు..

Hardworkneverfail