Bright Telangana
Image default

Avatar 2 review: జేమ్స్ కామెరూన్ సృష్టించిన మ‌రో విజువ‌ల్ వండ‌ర్‌

Avatar 2 review

Avatar 2 Review : అవతార్.. ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. 13 ఏళ్ల క్రితం ఈ మూవీ సాధించిన హిట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ గా అవతార్ 2 సినిమా వచ్చింది. జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి అవతార్. ఇప్పుడు అవ‌తార్ 2–ది వే ఆఫ్ వాటర్ అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 52 వేల స్క్రీన్ లలో 160 భాషల్లో రిలీజైంది. ఫస్ట్ పార్ట్ లో పండోరా అందాలను అద్భుతంగా చూపించిన జేమ్స్ కామెరూన్.. పార్ట్ 2లో సముద్రపు అడుగు భాగాన్ని అంతకుమించిన అందాలతోనే తెరకెక్కించాడు. మరి ఈ సినిమా కథేంటి..? ఫస్ట్ మూవీ సాధించిన హిట్ ని ఇది అందుకోగలిగిందా లేదా..? అనేది రివ్యూలో చూద్దాం..

కథేమిటంటే..
ఫస్ట్ మూవీలో భూమి నుంచి పండోరా గ్రహానికి వెళ్లిన జేక్ అక్కడే ఓ తెగకు చెందిన నేతిరిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. నేతిరి తండ్రికి ఇచ్చిన మాట కోసం జేక్ ఆ తెగకి నాయకుడవుతాడు. లోక, నేటియం, టూక్ అనే ముగ్గురు పిల్లలతో పాటు దత్త పుత్రిక కిరి, మరో బాలుడు స్పైడర్ తో సంతోషంగా జీవిస్తుంటారు. ఇక భూ ప్రపంచం అంతరించిపోతోందని, ఎలాగైన పండోరాలో ఉన్నవారిని అంతంచేసి.. దాన్ని ఆక్రమించుకోవాలని చూస్తుంటారు మనుషులు. దీంతో తన ఫ్యామిలీని కాపాడుకునేందుకు ఉన్న ఊరిని, మనుషుల్ని వదిలి మరో ప్రాంతం మెట్కాయినాకు వెళ్తారు. అక్కడ సముద్రమే తమ జీవనాధారం, జీవితం అంటూ జీవనం సాగిస్తుంటారు. వాళ్లతో కలిసి అక్కడే జీవిస్తున్న జేక్ కుటుంబాన్ని ఎలాగైన అంతం చేయాలని చూస్తుంటారు మైక్ స్కోరెస్ టీమ్. అక్కడ వాళ్ల మధ్య జరిగిన యుద్ధమే ఈ మూవీ స్టోరీ.

ఎలా ఉందంటే..?
జేమ్స్ కామెరూన్ ఈ మూవీని 3 గంటల 12నిమిషాల నిడివిడితో తీశాడు. హాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంత లాంగ్ సినిమాలు రావడం చాలా అరుదు. మూవీలో ఎలాంటి ట్విస్ట్ లు లేకున్నా.. జేమ్స్ మాయాజాలానికి ప్రేక్షకులు కుర్చీలకు అతుక్కుపోవాల్సిందే. ఈ మూవీకి జేమ్స్ కామెరూన్.. కథకంటే విజువల్స్ మీదే ఎక్కువ దృష్టి పెట్టినట్లు అనిపిస్తోంది. కథలో అక్కడక్కడా భారతీయ విశ్వాసాలు, విలువలు కనిపిస్తుంటాయి.

Avatar 2 Trailer

ప్లస్ లు మైనస్‌లు..
ఇక జాక్ కొడుకు తిమింగలంతో పోరాటం చేసే సీన్, పాయకాన్ అనే సముద్రజీవితో స్నేహం..అది జాక్ కి సాయం చేయడం వంటివి ఈ మూవీకి హైలెట్ అని చెప్పొచ్చు. అయితే స్టోరీలో కొత్తదనం లేకపోవడం, ల్యాగ్ గా అనిపిస్తుండటంతో అప్పుడప్పుడు ఇంకా సినిమా అయిపోలేదా..? అనే ఫీలింగ్ కలుగుతుంటుంది. అయితే జేమ్స్ త్రీడి ఎఫెక్ట్ లో చూపించిన అద్భుమైన విజువల్స్, రస్సెల్ కార్పెంటర్ సినిమాటోగ్రఫీ, సైమన్ ఫ్రాంగ్లెన్ మ్యూజిక్ కు ప్రతీ ప్రేక్షకుడు మంత్రముగ్దుడవ్వాల్సిందే.

ఎవరెలా చేశారంటే..?
ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇందులో హీరోగా నటించిన సామ్ వర్తింగ్ టన్ తన భావోద్యేగం, యాక్షన్ సీన్స్ తో అందర్నీ ఆకట్టుకుంటాడు. స్టీఫెన్ లాంగ్, జోయ్ సల్దానా, కేట్ విన్స్ లెట్, సిగౌర్నీ వేవర్, జాక్ ఛాంపియన్, విన్ డిజిల్ తమ పాత్రలకు న్యాయం చేశారు.

Related posts

Avatar 2 Movie : అవతార్ 2 మూవీ కొత్త ట్రైలర్ వచ్చేసింది..

Hardworkneverfail

Avatar 2 Trailer : మోస్ట్ అవైటెడ్ అవతార్ 2 ట్రైలర్ వచ్చేసింది..

Hardworkneverfail