Bheemla Nayak Movie Total Business : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కోసింది అని చెప్పాలి. మూవీ పై ఆడియన్స్ లో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి అని చెప్పాలి, 2022 ఇయర్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఫస్ట్ టాప్ స్టార్ మూవీ ఇదే అవ్వడంతో అంచనాలు ఆల్ రెడీ భారీగా పెరిగి పోగా పవన్ కళ్యాణ్ లుక్స్ కానీ సాంగ్స్ కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ కానీ ఆల్ రెడీ బిగ్ హిట్ గా నిలవడంతో కామన్ ఆడియన్స్ లో కూడా అంచనాలు తీసిపోని రేంజ్ లో ఉన్నాయి. ఆ అంచనాలను ఏమాత్రం తీసిపోని రేంజ్ లో భీమ్లా నాయక్ మూవీ బిజినెస్ కూడా ఓవరాల్ గా జరిగింది అని చెప్పాలి.
బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ వకీల్ సాబ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం 2 వారాల రన్ కే ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సెకెండ్ వేవ్ టైం లో సొంతం చేసుకోగా ఆ మూవీకి మించిన బిజినెస్ ను ఇప్పుడు భీమ్లా నాయక్ మూవీ సొంతం చేసుకుంది. ఒకసారి మూవీ ఏరియాల వారి బిజినెస్..
నైజాం | 35.00 cr |
ఉత్తరాంధ్ర | 9.00 cr |
సీడెడ్ | 16.50 cr |
ఈస్ట్ | 6.40 cr |
వెస్ట్ | 5.40 cr |
గుంటూరు | 7.20 cr |
నెల్లూరు | 3.25 cr |
కృష్ణా | 6.00 cr |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 88.75 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 9.00 cr |
ఓవర్సీస్ | 9.00 cr |
వరల్డ్ వైడ్ (మొత్తం) | 106.75 cr |
ఇదీ మొత్తం మీద భీమ్లా నాయక్ మూవీ (Bheemla Nayak Movie) సాధించిన ఓవరాల్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కూడా ఇది బిగ్గెస్ట్ బిజినెస్ అని చెప్పాలి. ఇక భీమ్లా నాయక్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు క్లీన్ హిట్ అవ్వాలి అంటే ఈ టార్గెట్ ను అందుకుని 107 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి భీమ్లా నాయక్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.