Bright Telangana
Image default

Bigg Boss 5 Telugu : లోబోకి స్పెషల్‌ పవర్‌.. ?

bigg boss 5 telugu latest promo today

తాజాగా కెప్టెన్సీ పోటీదారుల కోసం పెట్టిన‘బంగారు కోడిపెట్ట’టాస్క్‌లో ఊహించని ట్విస్ట్‌ ఇచ్చి ఇంటి సభ్యులకు షాకిచ్చాడు బిగ్‌బాస్‌. ‘బంగారు కోడిపెట్ట’టాస్క్‌లో భాగంగా రెండు రోజుల నుంచి ఇంటి సభ్యులు గుడ్లను సంపాదించి, దాచుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంటి సభ్యుల మధ్య గొడవలు కూడా జరిగాయి. ముఖ్యంగా సన్నీ, ప్రియలు అయితే ఫిజికల్‌ అటాక్‌ వరకు వెళ్లారు. ఎలాగైన కెప్టెన్‌ కావాలనే కసితో టాస్క్‌ ఆడుతున్నారు కంటెస్టెంట్స్‌. అయితే టాస్క్‌ల్లో గెలవడం అనేది కేవలం కష్టం మీదనే ఆధారపడి లేదని, కొంచెం అదృష్టం కూడా ఉండాలని నిరూపిస్తున్నాడు బిగ్‌బాస్‌.

తాజాగా ఈ గేమ్‌లో నుంచి ఒకరిని ఎలిమినేట్‌ చేసే అవకాశం రీఎంట్రీ ఇచ్చిన లోబో చేతికి ఇచ్చాడు బిగ్‌బాస్‌. అతని చేతిలో బ్లాక్‌, గొల్డెన్‌ కలర్‌ ఎగ్స్‌ ఉన్నాయి. వాటి ద్వారా ఒకరిని గేమ్‌ నుంచి తొలగించొచ్చు, మరొకరిని నేరుగా కెప్టెన్సీ పోటీదారుడిగా ఎంపిక చేయ్యొచ్చు. బ్లాక్‌ ఎగ్‌ ఎవరికిస్తే వారు ఈ టాస్క్‌ నుంచి ఔట్‌ అయినట్లు. గొల్డెన్‌ ఎగ్‌ పొందిన వారు డెరెక్ట్‌గా కెప్టెన్సీ పోటీదారుడిగా ఎంపికైతారు. మరి లోబో ఈ రెండు గుడ్లను ఎవరెవరికి ఇచ్చారో తెలియాలంటే.. ఈరోజు ఎపిసోడ్‌ చూడాల్సిందే. మరి ఆలస్యం ఎందుకు అంతవరకు ఈ ప్రోమోని చూసి ఎంజాయ్ చేయండి.

Related posts

Bigg Boss 5 Telugu : నాగార్జున సపోర్ట్‌తో షణ్ముఖ్‌పై రివెంజ్‌ తీర్చుకున్న రవి..

Hardworkneverfail

Bigg Boss 5 Telugu Promo : మునుపటి సీజన్‌ల హౌస్ మేట్స్ తో సరదా చిట్ చాట్..

Hardworkneverfail

Bigg Boss 5 Telugu Promo : వీకెండ్ వచ్చేసింది..వేదికపై కుటుంబ సభ్యులు..!

Hardworkneverfail

Bigg Boss 5 Telugu: శ్రీరామ్ చంద్రకు సోనూసూద్ మద్దతు, వీడియో వైరల్..

Hardworkneverfail

Bigg Boss 5 Telugu: హౌస్‏లో రచ్చ రచ్చ.. సన్నీని రెచ్చగొట్టిన సిరి, షణ్ముఖ్..

Hardworkneverfail

Bigg Boss 5 Telugu: కెప్టెన్సీ టాస్క్ లో సన్నీ Vs శ్రీరామచంద్ర

Hardworkneverfail