Bigg Boss 5 Telugu Promo : బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 చివరి దశకు చేరుకుంది. వచ్చే ఆదివారమే గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ వారమే లాస్ట్ ఎలిమినేషన్ జరగనుంది. బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం 6గురు మాత్రమే ఉండగా శ్రీరామచంద్ర, సన్నీ టాప్ 5కు చేరుకున్నారు. మిగిలిన 4గురు ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. షణ్ముఖ్, సిరి, మానస్, కాజల్ నామినేషన్స్‌లో ఉండగా.. వీరిలో అత్యధిక ఓట్లు వచ్చిన వారిలో షణ్ముఖ్, మానస్, సిరి ఉన్నారని సమాచారం అందుతోంది. ఇక ఈ వారం అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన కాజల్ హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్నట్లు తెలుస్తుంది.
తాజా ప్రోమోను విడుదల చేసారు బిగ్ బాస్ మేకర్స్. …