Bright Telangana
Image default

Bigg Boss 5 Telugu : ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్‌ ద‌క్కించుకున్న స‌న్నీ ?

ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్‌ ద‌క్కించుకున్న స‌న్నీ

బిగ్‌బాస్ ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్‌ను ప్ర‌వేశ‌పెట్టాడు. ఇది గెల్చుకున్న కంటెస్టెంట్ ఈజీగా ఎలిమినేష‌న్ గండం నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. లేదంటే వేరే ఎవ‌రినైనా సేవ్ చేయ‌వ‌చ్చు. బిగ్‌బాస్ ఈ పాస్‌ను పొంద‌డం కోసం నిప్పులే శ్వాస‌గా గుండెలో ఆశ‌గా అనే టాస్క్ ను ఇచ్చాడు. ఈ గేమ్‌లో భాగంగా ఫైర్ అలార‌మ్ మోగిన‌ప్పుడు ఏ ఇద్ద‌రు ట్రక్కులోకి వెళ‌తారో వారు బ‌ర్నింగ్ హౌస్‌లో నుంచి ఒక‌రిని సేవ్ చేస్తూ మ‌రొక‌రి ఫొటోను కాల్చేసే అధికారం పొందుతారు. అలా చివ‌రి వ‌ర‌కు ఎవ‌రి ఫొటో అయితే కాల‌కుండా ఉంటుందో ఆ కంటెస్టెంట్‌కు ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్ ద‌క్కుతుంది.

అయితే ప్రోమోలో త‌న‌కు ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్ క‌న్నా జ‌నాల ఓటింగే ముఖ్యం అని బిగ్‌బాస్‌కు షాకిచ్చాడు ష‌ణ్ముఖ్‌. ప్రేక్ష‌కుల వ‌ల్లే ఇక్క‌డిదాకా వ‌చ్చాన‌ని, గెలుపైనా, ఓట‌మైనా వాళ్ల చేతుల్లో నుంచి తీసుకోవాల‌ని ఉంద‌ని చెప్పింది సిరి. అంటే ష‌ణ్ను- సిరి త‌మ‌కు ఈ పాస్ అక్క‌ర్లేద‌ని చెప్పేశారు. మొత్తానికి ఈ గేమ్‌లో స‌న్నీ గెలిచిన‌ట్లు ఓ వార్త సోష‌ల్ మీడియాలో లీకైంది. అదే నిజ‌మైతే స‌న్నీ ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్‌ను ఈ వార‌మే వాడ‌తాడా? ఒక‌వేళ వాడితే త‌న‌కోసం వాడతాడా? ఇత‌రుల‌ను సేవ్ చేయ‌డానికి ఉప‌యోగిస్తాడా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది! మరి ఆలస్యం ఎందుకు అంతవరకు ఈ ప్రోమో చూసి ఎంజాయ్ చేయండి.

Related posts

Bigg Boss 5Telugu : హేట్ యు అంటూనే ష‌ణ్నుకు సిరి కౌగిలింత‌లు, ఆ వెంట‌నే ఏడుపు

Hardworkneverfail

Bigg Boss Telugu 5: ‘బిగ్‌బాస్‌’లో విజయ్‌ దేవరకొండ హంగామా!

Hardworkneverfail

Bigg Boss Telugu 5: కాజల్‌ ఓటు వల్లే ప్రియ, శ్వేత వెళ్లిపోయారు

Hardworkneverfail

Bigg Boss 5 Telugu : ఈ వారం ఎలిమినేట్ కానున్న ప్రియ?

Hardworkneverfail

Bigg Boss Telugu 5: బిగ్ బాస్ హౌస్ నుంచి నటరాజ్ మాస్టర్ అవుట్

Hardworkneverfail

Bigg Boss 5 Telugu: హౌస్‏లో రచ్చ రచ్చ.. సన్నీని రెచ్చగొట్టిన సిరి, షణ్ముఖ్..

Hardworkneverfail