Bright Telangana
Image default

ప్రపంచంలో ఇప్పుడు అత్యంత సంప‌న్న దేశంగా చైనా..!

China is now the richest country in the world

అమెరికా, చైనా మ‌ధ్య గ‌త కొన్నాళ్లుగా వాణిజ్య పోరు సాగుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అమెరికాకు షాకిచ్చే రీతిలో మ‌రో సంచ‌ల‌నం న‌మోదు అయ్యింది. ప్ర‌పంచంలోనే అత్యంత సంప‌న్న దేశంగా చైనా ఆవిర్భ‌వించింది. గ‌డిచిన రెండు ద‌శాబ్ధాల్లో ప్ర‌పంచవ్యాప్తంగా సంప‌ద మూడింత‌లు పెరిగిన‌ట్లు విశ్లేష‌కులు అంచ‌నా వేశారు. దాంట్లో చైనా ముందంజ‌లో ఉన్న‌ట్లు తేల్చారు. టాప్ స్పాట్‌లో ఉన్న అమెరికాను వాళ్లు వెన‌క్కి నెట్టేశారు. దీనికి సంబంధించిన నివేదిక‌ను మెకెన్సీ అండ్ కంపెనీ వెల్లడించింది.

10 అగ్ర‌దేశాల జాతీయ బ్యాలెన్స్ షీట్ల‌ను ప‌రిశీలించిన మెకెన్సీ అండ్ కంపెనీ ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేసింది. మెక‌న్సీ కంపెనీ ప్ర‌కారం ఆ 10 దేశాల వ‌ద్ద ప్ర‌పంచంలోని సుమారు 60 శాతం సంప‌ద ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆ దేశాల జాబితాలో చైనా, అమెరికా, జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్‌, కెన‌డా, యూకే, ఆస్ట్రేలియా, జ‌పాన్‌, మెక్సికో, స్వీడ‌న్‌లు ఉన్నాయి. గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో ఇప్పుడు మ‌నం సంప‌న్నుల‌మ‌య్యామ‌ని జూరిచ్‌లోని మెక‌న్సీ గ్లోబ‌ల్ ఇన్స్‌టిట్యూట్ భాగ‌స్వామి జాన్ మిచ్‌కి తెలిపారు.

మెక‌న్సీ ఏజెన్సీ నివేదిక ప్ర‌కారం ప్ర‌పంచ‌ వ్యాప్తంగా 2000 సంవత్సరంలో 156 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న ప్రపంచ నికర సంపద 2020 నాటికి 514 ట్రిలియన్ డాలర్లకు పెరిగినట్లు అధ్యయనం తెలిపింది. దాంట్లో ఒక్క చైనాలోనే సంప‌ద మూడో వంత పెరిగిన‌ట్లు తేల్చేశారు. 2000 సంవ‌త్స‌రంలో 7 ట్రిలియ‌న్ల డాల‌ర్లు ఉన్న చైనా సంప‌ద ఇప్పుడు 120 ట్రిలియ‌న్ల డాల‌ర్ల‌కు చేరుకున్న‌ట్లు పేర్కొన్నారు. ప్ర‌పంచ వాణిజ్య సంస్థ‌లో చైనా చేరిన త‌ర్వాత ఆ దేశ సంప‌ద దూసుకెళ్తున్న‌ట్లు మెక‌న్సీ త‌న రిపోర్ట్‌లో తెలిపింది. మ‌రో వైపు అమెరికాలో ప్రాప‌ర్టీ విలువ‌లు పెరిగినా.. ఆ దేశ సంప‌ద 90 ట్రిలియ‌న్ల డాల‌ర్ల‌కు చేరుకున్న‌ట్లు తెలుస్తోంది. అయితే రెండు దేశాల్లోనూ 10 శాతం సంద‌ప‌న్న సంప‌న్నుల వ‌ద్దే ఉన్న‌ట్లు గుర్తించారు. అమెరికా, చైనాలో ఉన్న సంప‌న్నుల షేర్లు కూడా వృద్ధి చెందుతున్న‌ట్లు నివేదికలో వెల్ల‌డించారు. మెక‌న్సీ ఏజెన్సీ నివేదిక ప్ర‌కారం.. ప్ర‌పంచ వ్యాప్తంగా 68 శాతం నిక‌ర సంప‌ద మొత్తం రియ‌ల్ ఎస్టేట్ రంగంలోనే ఉన్న‌ది. ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌, మెషిన‌రీ, ఎక్విప్మెంట్, ప్రాప‌ర్టీ, పేటెంట్స్ లాంటి వ‌ద్ద కొంత బ్యాలెన్స్ సంప‌ద ఉన్న‌ట్లు గుర్తించారు.

Related posts

Gun Fire : అమెరికాలో కాల్పులు.. నల్గొండ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి

Hardworkneverfail

Alert : చైనాలో ఒక్క రోజే 3.7 కోట్ల కరోనా కేసులు..

Hardworkneverfail

Planes Crash : ఎయిర్‌షోలో విషాదం.. ఎదురెదురుగా ఢీకొన్న యుద్ధ విమానాలు

Hardworkneverfail

China Earthquake : చైనాలో భూకంపంతో 74 మంది మృతి

Hardworkneverfail

China Drought: తీవ్ర విద్యుత్ సంక్షోభంలో చైనా, 50 ఏళ్లలో ఎప్పుడూ చూడనంత దుర్భరమైన కరవు

Hardworkneverfail

KTR US Tour : తెలంగాణకు పెట్టుబడుల వరద.. అమెరికాలో ముగిసిన మంత్రి కేటీఆర్ పర్యటన

Hardworkneverfail