Bright Telangana
Image default

Tollywood Hero’s: స్పందించిన టాలీవుడ్.. చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ భారీగా విరాళాలు..

tollywood actors donation

ఆంధ్రప్రదేశ్‏లో ఇటీవల కురిసిన వర్షాలతో రాయలసీమలోని జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు, కడప, జిల్లాలు వరదల ధాటికి అతలాకుతలమయ్యాయి. విస్తారంగా కురిసిన వర్షాలకు చెట్లు, ఇళ్లు నెలమట్టం కాగా.. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. వరదల వల్ల రూ.6,054 కోట్లు నష్టం వాటిల్లినట్లు ఏపీ ప్రభుత్వం అంచనా వేసింది. ఇళ్లు కూలిపోవడం, పంటలు దెబ్బతినడంతో లక్షలాది మంది రోడ్డున పడిన పరిస్థితి నెలకొంది. వరదల దాటికి పూర్తిగా నష్టపోయిన వారి కోసం ఆంధ్రప్రదేశ్‏ ప్రభుత్వం సహాయక చర్యలను మొదలు పెట్టింది. ఈ క్రమంలో టాలీవుడ్ హీరోలు వరద బాధితుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు.

ఈ క్రమంలోనే ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు సినీ ఇండస్ట్రీ నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. మెగా ఫ్యామిలీ మరోసారి పెద్ద మనసు చాటుకుంది. ఏ విపత్తు వచ్చినా బాధితులకు అండగా ఉంటామని మెగా ఫ్యామిలీ మరోసారి నిరూపించుకుంది. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం చిరంజీవి, రాం చరణ్ ఇద్దరూ చెరో 25 లక్షలు విరాళం ప్రకటిస్తున్నట్లు మెగాస్టార్ ట్వీట్ చేశారు. మహేష్ బాబు వరద బాధితుల కోసం 25 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించగా అలాగే జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా తన వంతు సాయంగా బాధితుల కోసం రూ. 25 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ మేరకు ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేస్తూ.. ఏపీ వరద విపత్తుకు నేను చేసే సాయం చిన్నదైనా బాధితులకు ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను అంటూ ట్వీట్‌ చేశారు.

Related posts

Maha Samudram: ఆసక్తికరంగా ‘మహా సముద్రం’ ట్రైలర్..

Hardworkneverfail

Evaru Meelo Koteeswarulu : సరదాగా సాగిన మహేష్, ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోమో

Hardworkneverfail

Raja Vikramarka: ఏజెంట్‌ విక్రమ్‌ రెడీ

Hardworkneverfail

పెద్దరికం నాకు వద్దు.. ఇద్ద‌రు కొట్టుకుంటుంటే ఆప‌డానికి రాను : చిరంజీవి

Hardworkneverfail

Mega Star Chiranjeevi : మెగాస్టారా.. మజాకా.. ఒక నెలలోనే 4 మూవీస్.. ఆల్ టైమ్ రికార్డ్

Hardworkneverfail

Sarkaru Vaari Paata: మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ ఓవర్సీస్ డీల్ క్లోజ్..?

Hardworkneverfail