Bright Telangana
Image default

Tollywood Heroes Remuneration: మన టాలీవుడ్ టాప్ హీరోల రెమ్యునరేషన్ ఎంతో మీకు తెలుసా…?

Tollywood Heroes remuneration

ఒకప్పుడు తెలుగు హీరోలు ఒక్కో మూవీకి 12 కోట్లు నుంచి 15 కోట్ల మధ్య పారితోషికం అందుకుంటేనే.. అమ్మో అనుకునేవాళ్లు. బాహుబలి మూవీ తర్వాత తెలుగు మూవీ ఇండస్ట్రీ రేంజ్ అనేది మారిపోయింది. ఇప్పుడు మన వాళ్లు తీసే మూవీస్ అన్నీ పాన్ ఇండియా మూవీస్ గా రూపొందుతున్నాయి దాని కోసం మన హీరోలు కూడా వాళ్ల రెమ్యునరేషన్ ని భారీగా పెంచారు. ముఖ్యంగా పాన్ ఇండియన్ ఇమేజ్ ఉన్న హీరోలు ఒక్కో మూవీకి 50 కోట్లకు పైగానే పారితోషికం అందుకుంటున్నారు. ప్రస్తుతం టాప్ హీరోలుగా కొనసాగుతున్న హీరోల రెమ్యునిరేషన్ లు ఎలా ఉన్నాయో ఒకసారి మనం తెలుసుకుందాం…

ప్రభాస్ : ఒక్కో మూవీకి 100 కోట్లకు పైగానే పారితోషికం అందుకుంటున్నట్లు అతడి పిఆర్ టీం అధికారికంగా ప్రకటించింది..

పవన్ కళ్యాణ్ : పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరస సినిమాలు చేస్తున్నాడు. ఒక్కో మూవీకి 50 కోట్లకు పైగానే అందుకుంటున్నట్లు తెలుస్తుంది. హరిహర వీరమల్లుకు 60 కోట్లు తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతుంది.

మహేష్ బాబు : సర్కారు వారి పాట మూవీకి గానూ మహేష్ బాబు 55 కోట్లు తీసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి.. పైగా ఈ మూవీకి ఈయన నిర్మాణంలో భాగం కూడా..

జూనియర్ ఎన్టీఆర్ : ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ కోసం జూనియర్ ఎన్టీఆర్‌కు 45 కోట్లకు పైగానే పారితోషికం ఇస్తున్నట్లు తెలుస్తుంది. మూడేళ్లు డేట్స్ ఇచ్చాడు కాబట్టి అంత తీసుకున్నాడని టాక్..

రామ్ చరణ్ : ఈయన కూడా 45 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తుంది.. శంకర్ మూవీ కోసం 60 కోట్ల వరకు అందుకుంటున్నాడని సమాచారం..

చిరంజీవి : ఆచార్య మూవీకి రామ్ చరణ్ నిర్మాత కాబట్టి చిరు రెమ్యునరేషన్ లెక్కలు తేలడం లేదు.. కానీ మార్కెట్ వ్యాల్యూ ప్రకారం ఆయన 50 కోట్ల వరకు అందుకుంటున్నాడు..

అల్లు అర్జున్ : పుష్ప మూవీ రెండు భాగాలకు కలిపి 60 కోట్లకు పైగానే అల్లు అర్జున్ పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తుంది..

రవితేజ : క్రాక్ మూవీ తర్వాత రవితేజ రెమ్యునరేషన్ పెరిగింది.. ఖిలాడీ కోసం 13 కోట్లు ఛార్జ్ చేసినట్లు టాక్.. తర్వాత చేయబోయే ధమాకా, రామారావు ఆన్ డ్యూటీ, టైగర్ నాగేశ్వరరావు సినిమాల కోసం 15 కోట్లకు పైగానే అందుకుంటున్నట్లు తెలుస్తుంది.

బాలకృష్ణ : అఖండ మూవీ కోసం బాలయ్య 11 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తుంది..

విజయ్ దేవరకొండ: వరస ఫ్లాపులు వస్తున్నా విజయ్ ఒక్కో మూవీకి 10 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం..

నాని : వరస ఫ్లాపుల కారణంగా నాని రేంజ్ కాస్త తగ్గింది.. ఒక్కో మూవీకి 8 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు వార్తలున్నాయి..

వరుణ్ తేజ్: వరస విజయాల్లో ఉన్నాడు కాబట్టి వరుణ్ తేజ్ పారితోషికం కూడా 8 కోట్ల వరకు ఉంది..

నాగార్జున: నాగార్జున కూడా ఒక్కో మూవీకి 7 కోట్ల వరకు తీసుకుంటున్నాడని టాక్..

వెంకటేష్: ఒక్కో మూవీకి 7 కోట్లు (అంచనా)

గోపీచంద్, శర్వానంద్, నితిన్ లాంటి హీరోలు 5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఒక మంచి మూవీ పడితే రెమ్యూనరేషన్ కూడా పెంచే ఆలోచనలో ఉన్నారు. ఇలా మూవీ ఇండస్ట్రీలో ఒక హీరో ఒక రకంగా తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.

Related posts

Varun Doctor Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘వరుణ్‌ డాక్టర్‌’ మూవీ

Hardworkneverfail

సల్మాన్ ఖాన్ అభిమానుల పిచ్చి పీక్స్ ..థియేట‌ర్‌లోనే బాణ‌సంచా కాల్చిన ఫ్యాన్స్‌

Hardworkneverfail

Akhanda Trailer: ‘అఖండ’ ట్రైలర్.. అఘోరగా బాలయ్య నట విశ్వరూపం..

Hardworkneverfail

Waltair Veerayya: ముఠామేస్త్రిని తలపించిన మాస్ వీరయ్య

Hardworkneverfail

Actress Hamsa Nandini : సినీ నటి హంసా నందినికి క్యాన్సర్.. గ్రేడ్‌ 3‏గా నిర్దారణ..

Hardworkneverfail

Tollywood Hero’s: స్పందించిన టాలీవుడ్.. చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ భారీగా విరాళాలు..

Hardworkneverfail