Bright Telangana
Image default

Drishyam 2 : వెంకటేష్ ‘దృశ్యం 2’ ట్రైలర్ రిలీజ్.. ఫ్యామిలీ క్రైమ్ డ్రామా..

వెంకటేశ్‌ హీరోగా నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘దృశ్యం-2’. 2014లో విడుదలైన ‘దృశ్యం’ మూవీకి సీక్వెల్‌గా ఈ మూవీ సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా దృశ్యం 2 ట్రైలర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఇందులో రాంబాబుగా వెంకటేశ్‌, ఆయన సతీమణిగా మీనాల నటన ఆకట్టుకునేలా ఉంది.

పోలీస్ ఆఫీసర్ నదియా కొడుకు హత్య కేసు అనంతరం రాంబాబు కుటుంబంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి.. నదియా కుమారుడి హత్య కేసు ఏమైంది అనే నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించినట్లుగా ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. రాంబాబు మూవీ థియేటర్ కట్టుకుని హాయిగా జీవిస్తుండగా.. మళ్లీ వరుణ్ హత్యకు సంబంధించిన అంశాలను తెరపైకి తీసుకువస్తారు పోలీసులు. ఇక దృశ్యం 2 ట్రైలర్ ఆద్యంతం థ్రిల్లింగ్ సస్పెన్స్‏తో సాగిపోయింది. ఆరేళ్ల తరువాత రాంబాబు జీవితంలో మళ్లీ ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి.. కేస్ ఇన్వెస్టిగేషన్ ఎలా మలుపు తిరిగింది.. తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు రాంబాబు ఎలాంటి ఎత్తులు వేశాడు? ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? కథలో ప్రతీ మలుపు అందరినీ ఆకట్టుకునేలా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇన్ని రోజులు ఈ మూవీ థియేటర్స్‌లో విడుదలవుతుందా లేక ఓటీటీలో విడుదలవుతుందా అనే విధంగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ‘దృశ్యం 2’ను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అలాగే, నవంబరు 25న ఈ మూవీ అమెజాన్‌ ఓటీటీ వేదికగా రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. వెంకీ గత మూవీ ‘నారప్ప’ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై హిట్ సాధించింది.

Related posts

ఓటీటీలోకి ‘తలైవి’ తెలుగు వెర్షన్‌ ఎప్పుడంటే ..!

Hardworkneverfail

Drushyam 2 : వెంకటేష్ ‘దృశ్యం 2’ మూవీ రివ్యూ

Hardworkneverfail

Pushpa Movie Ott : ఓటీటీలో ‘పుష్ప’ మూవీ.. అమెజాన్‌ ప్రైమ్ లో ఎప్పుడంటే..?

Hardworkneverfail

New Telugu Movies Ott Release : ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న తెలుగు మూవీస్ లిస్ట్ ..

Hardworkneverfail

Acharya Movie : ‘ఆచార్య’ మూవీ ఓటిటి డీల్ క్లోజ్..!

Hardworkneverfail

Pushpaka Vimanam OTT: ఆహాలో ‘పుష్పక విమానం’ మూవీ ఓటిటి రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్.. ఎప్పుడంటే..?

Hardworkneverfail