Bright Telangana
Image default

Facebook: నవంబరులో కొత్త పేరుతో ఫేస్‌బుక్ ?

facebook plans to change name

ప్రపంచంలో కోట్ల మంది ప్రజలు సోషల్ మీడియాను వాడుతున్నారు. అందులో ఫేస్‌బుక్ ఒకటి. ఈ సోషల్ మీడియా దిగ్గజం.. ఫేస్‌బుక్ పేరు మార్చుకుని రాబోతున్నట్లు The Verge అనే మీడియా వెల్లడించింది. ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ ఈ మేర ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అక్టోబర్ 28న జరిగే వార్షిక సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుని ఖరారు చేయనున్నారు. వర్క్ ప్లేస్ కొలాబరేషన్ కోసం ఫేస్‌బుక్ ఇటీవల ‘హొరైజన్ వర్క్ రూమ్స్’ అనే కాన్సెప్టును పరిచయం చేసింది. దీంతో ‘హోరైజన్’ అనే కొత్త పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

అమెరికా ప్రభుత్వం నుంచి వ్యాపార లావాదేవీలకు మాత్రమే ఉపయోగపడుతుందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఫేస్‌బుక్ కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాలు ఎదురైనప్పుడల్లా ఫేస్‌బుక్‌ పేరు తరచూ వార్తల్లో రావడంతో అది యూజర్ల సంఖ్యపై విపరీతంగా ప్రభావం చూపిస్తోందని కంపెనీ విశ్వసిస్తోంది. దీంతో కంపెనీకి కొత్త పేరు పెట్టి కొంత ఉపశమనం పొందాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పేరు మారిన తర్వాత ఫేస్‌బుక్ అనే పేరెంటింగ్ కంపెనీ తరపున కొత్త కంపెనీ పనిచేస్తుందన్నమాట. అంటే ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్, ఒక్యూలస్ లాంటి వాటితో పాటు ఫేస్‌బుక్ కొత్త కంపెనీ సమానంగా వ్యవహరిస్తుంది.

ఫేస్‌బుక్ వర్చువల్ రియాలిటీ(వీఆర్), ఆగ్మెంటెడ్ రియాలిటీ(ఏఆర్)లలో భారీగా పెట్టుబడులు పెట్టింది. వీటి ద్వారా పలు డివైజ్ లలో, యాప్ లలో మూడు బిలియన్ యూజర్లతో కనెక్ట్ అవ్వొచ్చు. ఈ మేర మంగళవారం యురోపియన్ యూనియన్ లో మరో ఐదేళ్లలో 10వేల జాబ్స్ క్రియేట్ చేయనున్నట్లు తెలుస్తుంది.

Related posts

Facebook: ఫేస్‌బుక్‌పై £50.5 మిలియన్ (రూ. 520 కోట్లు) జరిమానా !

Hardworkneverfail

ప్రపంచవ్యాప్తంగా స్తంభించిన ఫేస్‎బుక్, వాట్సప్, ఇన్‎స్టా సేవలు

Hardworkneverfail

Facebook: ఫేస్‌బుక్‌ యూజర్లకు భారీ షాక్‌..!

Hardworkneverfail

Facebook: పేరు మార్పిడి వివాదంలో ఇరుకున్న ఫేస్‌బుక్‌..!

Hardworkneverfail