Bright Telangana
Image default

Ginna Teaser : హారర్ టచ్ ఇచ్చిన మంచు విష్ణు ‘జిన్నా’ మూవీ టీజర్!

Ginna Teaser out now

Ginna Teaser : మంచు విష్ణు హీరోగా నటిస్తున్న మూవీ ‘జిన్నా’. ఎవిఎ ఎంటర్ టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ మీద మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ మూవీని ఇషాన్ సూర్య డైరెక్ట్ చేస్తున్నాడు. పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ కాగా.. సన్నీ లియోన్ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. శుక్రవారం ఈ మూవీ టీజర్ ను తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేశారు మేకర్స్. బ్యాడ్ టైమ్ ను వెంట తెచ్చే జిన్నా అంటే రంగాపురంలోని అందరికీ హడల్. అలాంటి జిన్నా జీవితం లక్ష్మీదేవి లాంటి సన్నీ లియోన్ ఎంట్రీతో ఎలా మారిందన్నదే కథ.

జిన్నా క్యారెక్టరైజేషన్ ను తెలియచేసే విధంగా ఈ టీజర్ సాగింది. దానికి తోడు ఈ మూవీలో ఎంటర్ టైన్ మెంట్ కు పెద్ద పీట వేశారన్నదీ టీజర్ చూస్తే తెలుస్తోంది. రఘుబాబు, త్రిపురనేని చిట్టీ, సునీల్, నరేశ్, చమ్మక్ చంద్ర, డాక్టర్ భద్రం తదితరులు ఈ టీజర్ లో కనిపించారు. పాయల్ రాజ్ పూత్ కంటే సన్నీలియోన్ ఎంట్రీ కాస్తంత భిన్నంగా ఉంది. ఎంటర్ టైన్ మెంట్, యాక్షన్ తో పాటు హారర్ ఎలిమెంట్స్ కూడా ఈ టీజర్ లో చోటు చేసుకోవడం విశేషం. ఈ మూవీని మూడు భాషల్లో అక్టోబర్ లో విడుదల చేయబోతున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్న ‘జిన్నా’కు కథ జి. నాగేశ్వరరెడ్డి, మాటలు, చిత్రానువాదం కోన వెంకట్. మరి ఈ మూవీతోనైనా మంచు విష్ణు హిట్ అందుకుంటాడేమో చూడాలి.

Related posts

MAA elections 2021: ‘మా’ సభ్యత్వానికి మెగా బ్రదర్ నాగబాబు రాజీనామా

Hardworkneverfail

MAA Elections 2021: మంచు విష్ణు ప్యానల్ కు మద్దతు తెలిపిన బాలకృష్ణ

Hardworkneverfail

MAA Elections: నాగబాబుకు మంచు విష్ణు కౌంటర్‌.. నాపై ఎందుకంత అక్కసు

Hardworkneverfail

MAA Election: మంచు విష్ణు ఘన విజయం

Hardworkneverfail

Unstoppable With NBK : అదరగొట్టేలా ‘అన్‌స్టాపబుల్‌’ ప్రోమో

Hardworkneverfail

Pawan Kalyan-Manchu Vishnu: పవన్‌ కళ్యాణ్ vs మంచు విష్ణు.. ఎడమొఖం.. పెడమొఖం.. ఎం జరిగింది..?

Hardworkneverfail