Bright Telangana

వరుణ్ తేజ్ ‘గని’ ఫస్ట్ గ్లింప్స్ విడుదల

మెగా హీరో వరుణ్‌ తేజ్‌ నటిస్తోన్న చిత్రం ‘గని’. బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. వరుణ్ తేజ్ జోడీగా సయీ మంజ్రేకర్ నటిస్తుండగా.. జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఒక ప్రత్యేకమైన పాత్రలో నదియా కనిపించనుంది.

కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం వరుణ్‌ తన మేకోవర్‌ను పూర్తిగా మార్చేశారు. మునుపెన్నడూ లేని విధంగా వరుణ్‌ జిమ్‌లో కఠోరమైన వ్యాయామాలతో బాడీ పెంచాడు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఇక ఇందులో వరుణ్ తేజ్… బాక్సర్ గెటప్ లో అందరినీ అలరించాడు. రక్తం తో ఉన్న ఓ సీన్ ను ఈ గ్లిం ప్స్ లో చూపించారు. అలాగే.. ఈ సినిమాను డిసెంబర్ 3వ తేదీన థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఈ చిత్రాన్ని అల్లు బాబీ, సిద్ధు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తుండగా.. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Related posts

Ghani: నేడే వరుణ తేజ్‌ ‘గని” టీజర్‌..టీజర్ లో చరణ్ వాయిస్ ఓవర్..!

Hardworkneverfail

Power of Ghani Special Glimpse : వరుణ్‌తేజ్ గని నుంచి స్పెషల్ గ్లింప్స్

Hardworkneverfail

Ghani Teaser: ఆట ఆడిన ఓడిన రికార్డ్స్ లో ఉంటావు..కాని గెలిస్తేనే చరిత్రలో ఉంటావు

Hardworkneverfail

Ghani: వీళ్లే ‘గని’ ప్రపంచం.. టీజర్‌ ఎప్పుడంటే..!

Hardworkneverfail