Bright Telangana
Image default

Rythubandhu: తెలంగాణ రైతులకు శుభవార్త.. ఆ రోజే ‘రైతుబంధు’ నిధులు జమ

CM KCR On Dalithabandhu

తెలంగాణ : రైతులకు వివిధ దశల్లో పెట్టుబడి సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం 2018 నుండి ‘రైతుబంధు’ పథకం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ యాసంగి సీజన్‌లోనూ రైతులకు పెట్టుబడి సాయం అందనుంది. ఇందుకు సంబంధించిన నగదును ఈ నెలాఖరులో గానీ, డిసెంబరు మొదటి వారంలో గానీ రైతుల అకౌంట్లలో జమ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ పథకం ద్వారా ఒక ఎకరం ఉంటే రూ. 5వేలు రైతుల అకౌంట్లలో జమ అవుతాయి. పంటలు సాగు చేసినా.. చేయకపోయినా .. భూమి ఉన్న ప్రతీ రైతుకు రైతుబంధు నిధులు రైతుల అకౌంట్లలో జమ అవుతాయి. తెలంగాణ ప్రభుత్వం సుమారుగా రూ.7500 కోట్లను కోటిన్నర ఎకరాలకు పంపిణీ చేయనుంది. సీఎం ఆదేశాల మేరకు నిధుల సర్దుబాటుపై ఆర్థికశాఖ దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఇక ఈ నెలాఖరి వరకు నిధులు సర్దుబాటు కాకపోతే డిసెంబర్ మొదటి వారంలో రైతుబంధు డబ్బులు విడుదల కానున్నాయి.

వ్యవసాయ శాఖ వద్ద రైతుల పట్టాదారు పాస్‌ పుస్తకాల నంబరు, బ్యాంకు ఖాతాలన్నీ అందుబాటులో ఉన్నాయి. కొత్తగా పాస్‌ పుస్తకాలు జారీ అయితే ఏఈవోలకు వారి వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. పాత రైతులు ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించే అవసరం ఉండదు. గడిచిన వానాకాలం సీజన్‌లో మొదటి రోజు ఒక ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు, రెండో రోజు రెండెకరాలు, మూడో రోజు మూడెకరాలు ఇలా ఆరోహణ పద్ధతిలో నగదు బదిలీ చేశారు. ఈసారి కూడా అదే పద్ధతిని ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి.

Related posts

Rythu Bandhu : తెలంగాణ రైతుల‌కు శుభ‌వార్త‌.. డిసెంబర్ 15 నుంచి ఖాతాల్లోకి డబ్బులు..!

Hardworkneverfail

Rythu Bandhu: రైతులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచే రైతు బంధు జమ..

Hardworkneverfail