Bright Telangana
Image default

T20 World Cup 2022 : టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన.. ఎప్పుడంటే?

t20 world cup 2022 team india

T20 World Cup 2022 (ముంబై) : ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్‌ జరగనున్న సంగతి తెలిసిందే. కానీ, ఈ మెగా టోర్నీకి భారత జట్టును సెప్టెంబర్ 15న బీసీసీఐ ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచకప్‌కు భారత జట్టును ఎంపిక చేసేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ముంబైలో సమావేశం కానుందని ఇన్‌సైడ్ స్పోర్ట్స్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఆసియా కప్-2022 ముగిసిన నాలుగు రోజుల తర్వాత సెలెక్టర్లు జట్టును ప్రకటిస్తారు. ఆసియాకప్‌లో ప్రదర్శన ఆధారంగా జట్టును ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే జట్లు తమ పూర్తి వివరాలను సెప్టెంబర్ 16లోగా ప్రకటించాలని ఐసీసీ డెడ్‌లైన్ విధించింది. తాజా సమాచారం ప్రకారం బీసీసీఐ సెప్టెంబర్ 15 న జట్టును ఎంపిక చేయనుంది.

ఈ మెగా టోర్నీకి ఒక్కో జట్టు 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేసుకునేందుకు అనుమతి ఉంది. క్రికెటర్లు, నెట్ బౌలర్లు మరియు సహాయక సిబ్బందితో పాటు మొత్తం 30 మంది ప్రయాణించవచ్చు. అధికారికంగా 15 మంది ఆటగాళ్లు, ఎనిమిది మంది సహాయక సిబ్బంది ఉండాలి. ఇక ఈ మెగా టోర్నీలో టీమిండియా తన తొలి మ్యాచ్‌లో తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో అక్టోబర్ 23 న మెల్‌బోర్న్ వేదికగా తలపడనుంది.

Related posts

IND vs NZ : న్యూజిలాండ్ పై ఇండియా ఘన విజయం.. వరుసగా 14వ టెస్ట్ సిరీస్ కైవసం

Hardworkneverfail

T20 World Cup: అఫ్ఘానిస్తాన్‌పై న్యూజిలాండ్‌ విజయం.. సెమీస్ నుంచి ఇండియా ఔట్!

Hardworkneverfail

T20 World Cup 2021: స్కాట్లాండ్ పై టీమిండియా ఘన విజయం … కేవలం 39 బంతుల్లో టార్గెట్ ఫినిష్

Hardworkneverfail

T20 World Cup : టీ20 ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన బీసీసీఐ

Hardworkneverfail

హార్దిక్ పాండ్యా వద్ద 5 కోట్ల విలువైన వాచ్ లను సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు

Hardworkneverfail

IND Vs SA 1st T20: కేఎల్ రాహుల్, సూర్యకుమార్ హాఫ్ సెంచరీలు.. టీమిండియా ఘనవిజయం

Hardworkneverfail