Bright Telangana
Image default

Ghani: వీళ్లే ‘గని’ ప్రపంచం.. టీజర్‌ ఎప్పుడంటే..!

Ghani telugu movie

మెగా హీరో వరుణ్‌ తేజ్‌ మొదటిసారి స్పోర్ట్స్ డ్రామాతో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా నటిస్తున్న మూవీ ‘గని’. కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని డిసెంబర్ 3న విడుదల చేయనున్నట్లు అధికారికంగా తెలిపారు. రీసెంట్ గా విడుదల చేసిన గని ఆల్బమ్ కు సూపర్బ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక ఇప్పుడు గని ప్రపంచాన్ని పరిచయం చేసారు.

ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ‘గని’ నుంచి ఓ స్పెషల్‌ వీడియో విడుదలైంది. ‘వరల్డ్‌ ఆఫ్‌ గని’ పేరుతో విడుదల చేసిన ఈ వీడియోలో మూవీలో ఉన్న క్యారెక్టర్స్ అందర్నీ పరిచయం చేశారు. నదియా, నరేశ్‌, తనికెళ్ల భరణి, నవీన్‌ చంద్ర, సునీల్‌ శెట్టి,జగపతి బాబు, ఉపేంద్ర ఈ మూవీలో కీలకపాత్రల్లో కనిపించనున్నారు. అనంతరం ‘గని’ టీజర్‌ని నవంబర్‌ 15న విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వరుణ్‌కు జోడీగా బాలీవుడ్‌ నటి సయీ మంజ్రేకర్‌ నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.

Related posts

Mega 154 Update: ఊర మాస్ అవతార్…మాస్‌ లుక్‌లో మెగాస్టార్‌ చిరంజీవి

Hardworkneverfail

Bheemla Nayak: అభిమానులకు సర్‌ప్రైజ్‌.. ‘లాలా భీమ్లా’ వీడియో ప్రోమో అదిరింది!

Hardworkneverfail

Samantha: సమంతకు ఊరట.. ఆ వీడియోలు వెంటనే తొలగించాలంటూ కోర్టు ఆదేశాలు..

Hardworkneverfail

ఆర్జీవీ షాకింగ్‌ ట్వీట్‌.. దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చిన మంచు మనోజ్‌

Hardworkneverfail

Ghani Teaser: ఆట ఆడిన ఓడిన రికార్డ్స్ లో ఉంటావు..కాని గెలిస్తేనే చరిత్రలో ఉంటావు

Hardworkneverfail

మెగాస్టార్ చిరంజీవి మూవీలో సల్మాన్‌ఖాన్‌.. బ్రిట్నీ స్పియర్స్‌తో అదిరిపోయే పాట

Hardworkneverfail