Bright Telangana
Image default

Puneeth Rajkumar Death: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చికిత్స పొందుతూ మృతి

Kannada actor Puneeth Rajkumar dies of heart attack at 46

కన్నడ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.. శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ గుండెపోటుతో మృతి చెందారు.. ఈ విషయాన్ని విక్రమ్ ఆసుపత్రి డాక్టర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆయన శుక్రవారం గుండెపోటుతో బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో చేరారు. నిన్న రాత్రి జిమ్ చేస్తూ గుండెపోటుకు గురైన ఆయనను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉంచి చికిత్స అందించారు వైద్యులు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమంగా మారడంతో ఈరోజు ఆసుపత్రిలోనే కన్నుమూశారు. పునీత్‌ వయసు 46. ఆయన ఇంత చిన్న వయసులోనే గుండెపోటు బారిన పడి కన్నుమూయడం సెలబ్రిటీలతో పాటు ఆయన అభిమానులను కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో ఈరోజు మధ్యాహ్నమే విక్రమ్ ఆసుపత్రికి వెళ్ళి పునీత్ రాజ్‌ కుమార్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ ఎస్ బొమ్మై. యష్ వంటి పలువురు ప్రముఖులు ఆసుపత్రిలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన మృతిపై షాక్ కు గురైన అభిమానులు, పలువురు సినీ పెద్దలు, ప్రముఖులు ట్వీట్‌లు చేశారు. ట్విట్టర్‌ ద్వారా తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Related posts

Pushpa : పుష్ప మూవీ నుంచి మరో మాస్ సింగిల్..

Hardworkneverfail

Major Movie: అడివి శేష్ ‘మేజర్’ మ్యూజిక్ రైట్స్ వారికే..

Hardworkneverfail

Enemy Collections: పర్వాలేదనిపించిన ‘ఎనిమి’ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ..!

Hardworkneverfail

‘సిరివెన్నెల’ మనకి ఇక లేడు.. సాహిత్యానికి ఇది చీకటి రోజు : చిరంజీవి

Hardworkneverfail

‘రిపబ్లిక్’ మూవీ ఫస్ట్ వీక్ టోటల్ కలెక్షన్స్ :పెట్టుబడిలో సగం కూడా రాలేదు

Hardworkneverfail

MAA Elections: నరేశ్‌ వల్లే ‘మా’లో ఇన్ని గొడవలు – శివాజీ రాజా

Hardworkneverfail