Bright Telangana
Image default

Waltair Veerayya : పూనకాలు లోడింగ్.. వాల్తేరు వీరయ్య నుంచి మాస్ మహారాజ్ టీజర్..

Mass Maharaja Ravi Teja First look Teaser from Waltair Veerayya

Mass Maharaja Ravi Teja First look Teaser from Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న మూవీ వాల్తేరు వీరయ్య. చాలా రోజుల తర్వాత చిరంజీవి ఫుల్ మాస్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ తో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో మాస్ మహారాజ్ రవితేజ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు అని ప్రకటించడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం మూవీ యూనిట్ యూరప్ లో సాంగ్ షూట్ తో బిజీగా ఉన్నారు. రెండు వారాల్లో మూవీ షూటింగ్ కు గుమ్మడి కాయ కొట్టబోతున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి రవితేజకి సంబంధించిన టీజర్ ని విడుదల చేశారు మేకర్స్. డైరెక్టర్ బాబీకి లైఫ్ ఇచ్చిన హీరో రవితేజ. దీంతో తన హీరోని ఇంకా మాస్ గా చూపించాడు బాబీ.

టీజర్ లో ఓ మేకపిల్లని పట్టుకొని ‘మేకపిల్లని పట్టుకొని మొదటిసారి పులి వస్తుంది’ అంటూ మాస్ వాయిస్ తో సాఫ్ట్ గా ఎంట్రీ ఇచ్చిన రవితేజ మరింత మాస్ గా ఫైట్ చేయడం చూపించారు. ఏంరా వారి, పిస పిస చేస్తున్నావు, నీకింకా సమాజ్ గాలే, నేను ఎవ్వని అయ్యకి వినను అని.. అంటూ మాస్ డైలాగ్స్ చెప్పాడు. టీజర్ మొత్తం రవితేజని ఫుల్ మాస్ గా చూపించాడు. ఈ మూవీలో రవితేజ పోలీసాఫీసర్ గా కనిపించనున్నట్టు తెలుస్తుంది. దీంతో రవితేజ అభిమానులతో పాటు మెగా అభిమానులు కూడా ఫుల్ ఫిదా అవుతున్నారు.

ఈ టీజర్ తో వాల్తేరు వీరయ్య మూవీపై మరిన్ని అంచనాలు పెంచేశారు. మెగా అభిమానులు, రవితేజ అభిమానులు ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కచ్చితంగా ఈ సంక్రాంతికి ఈ మూవీ పెద్ద హిట్ కొడుతుందని అంటున్నారు.

Related posts

Dhamaka Trailer: ధమాకా ట్రైలర్.. ఎగ్జాంపుల్ సెట్ చేశానంటోన్న రవితేజ!

Hardworkneverfail

Acharya​ Movie Song : ‘ఆచార్య’ నుంచి ‘శానా కష్టం’ లిరికల్ వీడియో రిలీజ్

Hardworkneverfail

Acharya Movie: ‘ఆచార్య’ మూవీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Hardworkneverfail

కలెక్టర్‌గా సాయితేజ్‌.. ‘రిపబ్లిక్‌’ ట్రైలర్‌ విడుదల చేసిన చిరంజీవి

Hardworkneverfail

Megastar Chiranjeevi: మెగాస్టార్ నోట ‘రంగ మార్తాండ’ షాయరీ

Hardworkneverfail

Tollywood Hero’s: స్పందించిన టాలీవుడ్.. చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ భారీగా విరాళాలు..

Hardworkneverfail