Bright Telangana
Image default

T20 World Cup 2021: అదరగొట్టిన శ్రీలంక… బంగ్లాదేశ్‌పై శ్రీలంక విజయం

t20-world-cup-2021-bangladesh-vs-srilanka

టీ20 ప్రపంచ కప్‌ 2021: నేడు శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య కీలక మ్యాచ్‌ జరిగింది. క్వాలిఫయర్ రౌండ్‌లో వరుస విజయాలు సాధించి మంచి ఊపు మీద ఉన్న శ్రీలంక.. అదే జోరును కొనసాగించి బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదటగా టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఓపెనర్లు నయీం, దాస్ శుభారంభం ఇచ్చారు. ముఖ్యంగా నయిమ్‌ చెలరేగి ఆడాడు.

52 బంతుల్లో 6 ఫోర్లతో 62 పరుగులు చేసి వెనుదిరిగాడు. తర్వాత ముష్పికర్ రెహ్మాన్ ధాటిగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగెత్తింది. 37 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్లతో 57 పరుగులు చేశాడు. శ్రీలంక బౌలర్లలో కరుణరత్న 1, ఫెర్నాండో 1, కుమార1 వికెట్ దక్కించుకున్నారు.

172 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన శ్రీలంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్‌లోనే నసూమ్‌ వేసిన నాలుగో బంతికి కుశాల్ పెరీరా బౌల్డ్ అయ్యాడు. నిసాంక కూడా 24 పరుగులకే వెనుదిరిగాడు. ఈ సమయంలో క్రీజులో అడుగుపెట్టిన అసలంక ధాటిగా ఆడాడు. స్కోరు బోర్డుని పరుగెత్తించాడు. 49 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 80 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఇతనికి తోడుగా రాజపక్స హాప్‌ సెంచరీతో అదరగొట్టాడు. 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్‌ బౌలర్లలో షకీబుల్ హసన్ 2, మహ్మద్‌ సైఫ్‌ద్దీన్ 1, అహ్మద్‌ 2 వికెట్లు సాధించారు.

Related posts

T20 World Cup: ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్ ఘన విజయం..ఫైనల్ కి న్యూజిలాండ్‌..

Hardworkneverfail

T20 World Cup 2021 : ఉత్కంఠ పోరులో శ్రీలంకపై సౌతాఫ్రికా విజయం

Hardworkneverfail

T20 World Cup 2021 : ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ విజయం…

Hardworkneverfail

T20 World Cup 2021: పాకిస్థాన్ పై పోరాడి ఓడిన ఆఫ్గనిస్తాన్‌

Hardworkneverfail

Ind vs Pak T20 Match: నేడు భారత్-పాక్ మధ్య టీ20 మ్యాచ్

Hardworkneverfail

T20 World Cup 2021: స్కాట్లాండ్‌‌ పై 130 పరుగుల భారీ తేడాతో అప్ఘానిస్తాన్ ఘన విజయం

Hardworkneverfail