Bright Telangana
Image default

T20 World Cup 2021 : ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ విజయం…

england vs australia t20 2021

టి20 ప్రపంచకప్‌ 2021 : ఇంగ్లాండ్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది ఇంగ్లాండ్. 126 పరుగుల టార్గెట్‌ను ఇంగ్లాండ్ కేవలం 11.4 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించింది.

ఓపెనర్లు జాసన రాయ్, జోస్ బట్లర్ మొదటి నుంచి ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. 20 బంతుల్లో ఓ ఫోర్, సిక్సర్‌తో 22 పరుగులు చేసిన జాసన్ రాయ్, జంపా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా, రివ్యూకి వెళ్లిన ఆస్ట్రేలియాకి అనుకూలంగా ఫలితం వచ్చింది. ఆ తర్వాత డేవిడ్ మిల్లయర్ 8 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసి అస్టన్ అగర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. జోస్ బట్లర్, జానీ బెయిర్ స్టో కలిసి మ్యాచ్‌ని ముగించారు.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ మొదలెట్టిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ బౌలర్ల దెబ్బకు 125 పరుగులకే ఆలౌట్ అయింది. కెప్టెన్ అరోన్ ఫించ్ (44) ఒంటరి పోరాటంతో ఆమాత్రం పరుగులైనా చేసి పరువు దక్కించుకుంది.

చివరల్లో ఆస్టన్ అగర్ (20), పాట్ కమిన్స్ (12), మిచెల్ స్టార్క్ (13) కాస్తంత పరవాలేదనిపించడంతో ఆసీస్ స్కోరు వంద పరుగులు దాటింది. జట్టులో ఆరుగురు ఆటగాళ్లు రెండంకెల పరుగులు కూడా సాధించలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 3 వికెట్లు తీసుకోగా, క్రిస్ వోక్స్, టైమల్ మిల్స్ చెరో రెండు వికెట్లు, ఆదిల్ రషీద్, లివింగ్‌స్టోన్ చెరో వికెట్ తీసుకున్నారు.

Related posts

T20 World Cup 2021: శ్రీలంక పై ఇంగ్లండ్‌ ఘన విజయం..!

Hardworkneverfail

T20 World Cup 2021: స్కాట్లాండ్‌ పై న్యూజిలాండ్ విజయం…

Hardworkneverfail

Ind vs Pak T20 Match: నేడు భారత్-పాక్ మధ్య టీ20 మ్యాచ్

Hardworkneverfail

T20 World Cup 2021: స్కాట్లాండ్‌‌ పై 130 పరుగుల భారీ తేడాతో అప్ఘానిస్తాన్ ఘన విజయం

Hardworkneverfail

వక్రబుద్ధిని చాటిన పాకిస్తాన్‌.. జెర్సీపై ఇండియా పేరు లేకుండానే…

Hardworkneverfail

T20 World Cup 2021: వెస్టిండీస్‎పై ఆస్ట్రేలియా ఘన విజయం..

Hardworkneverfail