Bright Telangana
Image default

CM KCR: ఢిల్లీలో సీఎం కేసీఆర్.. నేడు ప్రధాని మోడీ, పలువురు కేంద్రమంత్రులతో భేటీ

ఢిల్లీ : సీఎం కేసీఆర్ ఆదివారం (నవంబర్ 21) సాయంత్రం బేగంపేట విమానశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన అధికారులతో కలిసి దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. రెండు మూడు రోజుల పాటు ఢిల్లీలోనే సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. యాసంగి వరిధాన్యం కొనుగోళ్లతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రంతో సీఎం కేసీఆర్, మంత్రులు, అధికారులు చర్చించనున్నారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులను కేసీఆర్ కలిసే అవకాశం ఉంది.

యాసంగి కొనుగోళ్లపై కేంద్రం నుంచి సీఎం కేసీఆర్ స్పష్టత కోరనున్నారు. యాసంగి ధాన్యం ఎంత కొంటారో స్పష్టత ఇవ్వాలని ఇప్పటికే పలుసార్లు కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. కానీ, కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మంత్రుల సమావేశంలో ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్రంతో తేల్చుకునేందుకు సీఎం ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర ప్రభుత్వం స్పందన బట్టి యాంసంగి పంటలపై సీఎం కేసీఆర్ ప్రకటన చేయనున్నారు.

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు ఫైండింగ్ అంశాలను కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, గజేంద్ర సింగ్ షేకావాత్ సహా పలువురు మంత్రులతో కలిసి కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది. అలాగే కృష్ణా, గోదావరి జలాల వాటా, నూతన ట్రిబ్యునల్ ఏర్పాటుపై కూడా కేంద్రం నుంచి కేసీఆర్ స్పష్టత కోరనున్నారు.

Related posts

TSRTC: ఆర్టీసీ యూనియన్లపై ప్రభుత్వం విధించిన రెండేళ్ల నిషేధం గడువు పూర్తి

Hardworkneverfail

Vijayasanti : సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి సెటైర్లు

Hardworkneverfail

CM KCR : తెలంగాణలో లాక్ డౌన్ అవసరం ప్రస్తుతం లేదు.. కేసీఆర్

Hardworkneverfail

Welfare Schemes: ఉచిత పథకాలు, సంక్షేమ పథకాలు పేదలను సోమరులుగా మారుస్తున్నాయా?

Hardworkneverfail

కేంద్ర, రాష్ట్ర సర్కార్‌లు రైతులను మోసం చేస్తున్నాయి: రేవంత్‌ రెడ్డి

Hardworkneverfail

Harish Rao: నిర్మలా సీతారామన్‌కు హరీష్‌ రావ్‌ సవాల్‌.. నేను రాజీనామా చేస్తా.. మీరు చేస్తారా?

Hardworkneverfail