Bright Telangana
Image default

చిరంజీవి : వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కావాలని అయ్యప్ప సాక్షిగా కోరుకుంటున్నా

వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కావాలని అయ్యప్ప సాక్షిగా కోరుకుంటున్నా

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమాజానికి చేస్తున్న సేవలు అనిర్వచనీయమైనవని మెగాస్టార్ చిరంజీవి కొనియాడారు. వెంకయ్యనాయుడు భారత రాష్ట్రపతి కావాలని అయ్యప్ప సాక్షిగా కోరుకుంటున్నానని చెప్పారు.

హైదరాబాద్‌లోని లాల్ బంగ్లాలో యోధ లైఫ్ లైన్ డయోగ్నస్టిక్స్ సెంటర్ ను ఈరోజు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్నో ఏళ్లుగా తన సొంత వనరులతో ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్నానని చెప్పారు. సినీ పరిశ్రమలో పని చేస్తున్న పేద కళాకారులకు లైఫ్ లైన్ డయోగ్నస్టిక్స్ సెంటర్ లో పరీక్షలు చేయించుకునే వెసులుబాటును కల్పించాలని కోరారు.

ప్రస్తుతం రాష్ట్రపతిగా ఉన్న రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం వచ్చే సంవత్సరం జులై నాటికి పూర్తి కానున్న సంగతి తెలిసిందే. 2017లో భారత ప్రథమ పౌరుడిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో చిరంజీవి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Related posts

అల్లర్లతో ‘మా’ పరువు తీయవద్దు: చిరంజీవి

Hardworkneverfail

Megastar Chiranjeevi : కేసీఆర్ కి థాంక్స్ చెప్పిన చిరంజీవి.. మరి ఏపీ పరిస్థితేంటి..?

Hardworkneverfail

RRR PRE Release Event : ‘ఆర్ఆర్ఆర్’ కోసం.. చిరంజీవి.. బాలయ్య..?

Hardworkneverfail

Acharya Movie : మెగా అభిమానులకు పండగే..ఆచార్య ‘సిద్ధ’ టీజర్ వచ్చేసింది

Hardworkneverfail

Nagarjuna on Chiru, CM Jagan Meet : చిరు, జగన్ భేటీకి నాగార్జున ఎందుకు వెళ్ళలేదు ?

Hardworkneverfail

మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కీలక పాత్రలో రవితేజ.. ?

Hardworkneverfail