Bright Telangana
Image default

Virupaksha Teaser : విరూపాక్ష టీజర్.. కొత్త కథతో విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నారుగా..

Virupaksha Teaser

Virupaksha Teaser : మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదం కారణంగా ఇంటికే పరితమైన ఈ యంగ్ హీరో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. తన 15 వ మూవీకి విరూపాక్ష (Virupaksha) అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఈ మూవీకి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కథని అందిస్తుండగా.. ఆయన శిష్యుడు కార్తీక్ దండు దర్శకుడిగా పరిచయం అవుతూ ఈ మూవీని చేస్తున్నాడు. కాగా ఈ మూవీ టీజర్ ని మార్చి 1న రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే భీమవరం సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ రావూరి పండు హార్ట్ ఎటాక్ తో మృతి చెందడంతో.. మూవీ టీజర్ రిలీజ్ ని పోస్ట్‌పోన్ చేశారు. తాజాగా నేడు ఈ మూవీ టీజర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.

మూవీ (Virupaksha) టైటిల్ ని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన గ్లింప్స్ తో ఆడియన్స్ లో మూవీ పై క్యూరియాసిటీని క్రియేట్ చేశారు మేకర్స్. ఇప్పుడు టీజర్ తో మూవీ పై అంచనాలు పెరిగేలా చేశారు. ఈ మూవీ మిస్టికల్ థ్రిల్లర్ గా రాబోతుంది. ఇక టీజర్ బట్టి చూస్తే.. ఒక గ్రామంలో క్షుద్రశక్తి పూజలు చేసే ఒక అజ్ఞాత వ్యక్తి వలన ఊరిలో అంతుచిక్కని రీతిలో మరణాలు జరుగుతుంటాయి. ఆ మరణాలు ఎవరు చేస్తున్నారో తెలియక ఊరు మొత్తం భయపడుతుంది. ఇక ఆ మరణాలకు కారణం అవుతున్న వ్యక్తిని హీరో ఎలా కనిపెట్టాడు, ఆ దారిలో తనకి ఎలాంటి సమస్యలు ఎదురైని అనేది మూవీ కథ అని తెలుస్తుంది.

ఇక మూవీ టీజర్ లో కొన్ని డైలాగ్స్.. ‘చరిత్రలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి, సమస్య ఎక్కడ మొదలైందో పరిష్కారం అక్కడే వెతకాలి, ఆ ప్రమాదం దాటడానికి నా ప్రయాణం’ వంటి డైలాగ్స్ ఇంటరెస్టింగ్ గా ఉన్నాయి. ఇంటెన్సివ్ యాక్షన్ సీన్స్ కూడా ఉండబోతున్నాయి. ఇక విజువల్స్ విషయానికి వస్తే.. చాలా గ్రాండ్ గా ఉన్నాయి. చూసే ఆడియన్స్ కి కొత్త అనుభూతుని కలిగిస్తాయి అని చెప్పడంలో సందేహం లేదు. కాంతార ఫేమ్ అజనీష్ లోకనాథ్ ఈ మూవీకి సంగీతం అందిస్తుండగా.. టీజర్ కి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హై లైట్ గా నిలిచింది.

ఈ మూవీలో సంయుక్త హీరోయిన్ గా నటిస్తుండగా.. సునీల్, రాజీవ్ కనకాల, జాన్సీ, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. కాగా ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ ప్రొడక్షన్స్ లో బివిఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 21న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘విరూపాక్ష’ మూవీతో సాయి ధరమ్ తేజ్ కూడా పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టబోతున్నాడు.

Related posts

Sai Dharam Tej: మెగా హీరోల దీపావళి సందడి.. హాజరైన సాయి ధరమ్ తేజ్..

Hardworkneverfail

రిపబ్లిక్ మూవీ రివ్యూ

Hardworkneverfail

ఓటీటీలోకి వస్తున్న సాయిధరమ్‌తేజ్ ‘రిపబ్లిక్’ మూవీ

Hardworkneverfail

Sai Dharam Tej: టీమ్‌తో కలిసి ఓటీటీలో ‘రిపబ్లిక్’ మూవీ చూసిన సాయి ధరమ్ తేజ్..

Hardworkneverfail

Virupaksha Title Glimpse : సాయి ధరమ్ తేజ్ మూవీ టైటిల్ ‘విరూపాక్ష’

Hardworkneverfail