Bright Telangana
Image default

WhatsApp Pay: అదిరిపోయే ఆఫర్‌..! ఒక్క రూపాయి పంపించినా.. రూ. 50క్యాష్‌ బ్యాక్‌.!

WhatsApp Pay spotted beta testing cashback feature in india

WhatsApp Pay Cashback Feature : వాట్సాప్‌ సంస్థ వాట్సాప్‌ పేమెంట్స్ కోసం అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. డబ్బులను ట్రాన్స్ఫర్ చేస్తే క్యాష్ బ్యాక్ అందిస్తున్నట్లు తెలిపింది. కొద్ది రోజుల క్రితమే.. వాట్సాప్ పేమెంట్స్ సేవలను ప్రారంభించింది వాట్సాప్‌ సంస్థ. అయితే ఎక్కువ మంది వినియోగదారులను తమ వైపు ఆకర్షించేందుకు క్యాష్ బ్యాక్ ఆఫర్లను తీసుకువచ్చింది వాట్సాప్. వాస్తవానికి ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ల గురించి వాట్సాప్ అధికారికంగా ఇప్పటివరకూ ప్రకటించలేదు. ప్రస్తుతానికి ఈ వాట్సాప్ పేమెంట్స్ క్యాష్ బ్యాక్ ఆప్షన్ వాట్సాప్ బీటా యూజర్ల ద్వారా టెస్టు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వాట్సాప్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఎంపిక చేసిన బీటా యూజర్లలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ మేరకు వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో (WABetaInfo) తెలిపింది.

మనీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు 51 రూపాయల క్యాష్ బ్యాక్ అందిస్తోంది. అయితే కేవలం ఒక రూపాయి పంపించినా కూడా క్యాష్ బ్యాక్ లభించడం విశేషం. అయితే.. ఈ ఆఫర్ ఐదు ట్రాన్సాక్షన్ల వరకు మాత్రమే వర్తిస్తుంది. మనీ పంపించిన వెంటనే ఆ క్యాష్ బ్యాక్ మన ఖాతాలో జమ అవుతుంది. అయితే ఈ ఆఫర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ఈ క్యాష్ బ్యాక్ సదుపాయం అందరికీ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. గతంలో గూగుల్ పే కూడా స్క్రాచ్ కార్డుల రూపంలో క్యాష్ బ్యాక్ అందించింది. అలాగే ఇతర డిజిటల్ పేమెంట్ ప్లాట్ ఫాంలైన పేటీఎం, ఫోన్ పే కూడా ఈ తరహా క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందించాయి. వాట్సాప్ పేమెంట్స్ కొత్తగా స్టిక్కర్స్ ఫీచర్ కూడా తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్స్ పేమెంట్స్ చేసినప్పుడు మెసేజ్ లకు బదులుగా స్టిక్కర్లను పంపుకోవచ్చు.

Related posts

WhatsApp New update: యూజర్స్ కి మరో అదిరిపోయే అప్డేట్ తో వాట్సాప్..!

Hardworkneverfail

WhatsApp Web: వాట్సాప్​ కొత్త ఫీచర్.. ఇంటర్​నెట్​ లేకున్నా​ వాడొచ్చు..

Hardworkneverfail

Whatsapp: మరో కొత్త ఫీచర్‌తో వాట్సప్‌.. లాస్ట్‌ సీన్‌ అనుమతించిన వారికి మాత్రమే

Hardworkneverfail

వాట్సాప్‌లో సెల్ఫ్ చాట్ ఫీచర్ గురించి మీకు తెలుసా ?

Hardworkneverfail