Lucknow Franchise Name Revealed : ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) లో కొత్తగా ఎంట్రీ ఇస్తున్న లక్నో జట్టు ఫ్రాంచైజీకి నయా పేరు వచ్చేసింది. ఇప్పటి నుండి లక్నో ఫ్రాంచైజీని లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants)గా పిలవనున్నారు. తమ జట్టుకి పేరును(Lucknow Franchise Name) సూచించాలంటూ లక్నో జట్టు ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో జనవరి 3న ప్రచారం నిర్వహించాయి. ఈ క్రమంలో లక్నో ఫ్రాంచైజీ యాజమాన్య సంస్థ అధినేత సంజీవ్ గోయెంకా తమ జట్టు పేరును అధికారికంగా వెల్లడించారు మరియు టీమ్ లోగోను కూడా నేడు ఆవిష్కరించారు.
ఐపీఎల్ లో రెండు కొత్త జట్లకు బీసీసీఐ 2021 లో బిడ్లు ఆహ్వానించగా, ఆర్పీఎస్జీ సుమారుగా రూ.7090 కోట్లతో లక్నో జట్టు ఫ్రాంచైజీని చేజిక్కించుకుంది. ఇప్పటికే లక్నో ఫ్రాంచైజీ ముగ్గురు కీలక ఆటగాళ్లను ఎంపిక చేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్ గా కేఎల్ రాహుల్ వ్యవహరించనున్నాడు. ఇతర ఇద్దరు ఆటగాళ్లు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మార్కస్ స్టొయినిస్ మరియు భారత దేశవాళీ స్పిన్నర్ రవి బిష్ణోయ్.
లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) ఫ్రాంచైజీ కేఎల్ రాహుల్ కు రికార్డు స్థాయి ధర రూ.17 కోట్లు చెల్లించనున్నారు. స్టొయినిస్ కు రూ.9.2 కోట్లు మరియు రవి బిష్ణోయ్ కి రూ.4 కోట్లు ఇవ్వనున్నారు. లక్నో సూపర్ జెయింట్స్ మిగతా ఆటగాళ్లను వేలంలో ఎంపిక చేసుకోనుంది. ఐపీఎల్ మెగా వేలం ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో నిర్వహించనున్నారు.
Team owner, Dr. Sanjiv Goenka, Chairman @rpsggroup unveils the name for the Lucknow IPL team. 😊👏🏼#LucknowSuperGiants #NaamBanaoNaamKamao #IPL2022 @IPL @BCCI @GautamGambhir @klrahul11 pic.twitter.com/TvGaZlIgFR
— Lucknow Super Giants (@TeamLucknowIPL) January 24, 2022