Heart attack prevention : వ్యాయామం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను అందుకోవడానికి మీరు రన్నర్ కానీ, క్రీడాకారులు కానీ కానవసరం లేదు. రోజుకు కొంత సమయం నడకకు కేటాయిస్తే చాలని బ్రిటన్‌లోని ఓ అధ్యయనం వెల్లడిస్తోంది. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 11 నిమిషాలు నడిస్తే ప్రతి 10 అకాల మరణాలలో ఒకటి నివారించొచ్చని ఈ అధ్యయనం చెప్తోంది.
హార్వాడ్ మెడికల్ ప్రకారం మనం నాలుగు రకాల వ్యాయామం చేయాలి. 1. బరువులు ఎత్తడం ద్వారా కండరాలు బలపరచడం 2. ఏరోబిక్ వ్యాయామం తో గాలి పీల్చుకునే సామర్థ్యం, రక్తప్రసరణ, గుండె ని ఆరోగ్యంగా చేయడం. జాగింగ్, రన్నింగ్, బ్రిస్క్ వాకింగ్ లాంటివి 3. స్ట్రెచింగ్ వ్యాయామం, అంటే యోగా లాంటివి ఫ్లెక్సిబిలిటీ కోసం. 4. బాలన్స్ వ్యాయామం. వయస్సు పెరిగే కొద్దీ మనకు బాలన్స్ గా పడిపోవకుండా వుండే సామర్థ్యం తగ్గుతుంది. అందుకే ఇలాంటి వ్యాయామం కూడా చేయాలి.