Bright Telangana
Image default

TS Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపిన తెలంగాణ సర్కార్

ts jobs

TS Jobs : తెలంగాణ సర్కార్ వరుస నోటిఫికెషన్స్ విడుదల చేస్తూ నిరుద్యోగుల్లో సంబరాలు నింపుతుంది. ఇప్పటికే పలు నోటిఫికెషన్స్ విడుదల చేయగా.. మ‌రో మూడు రోజుల్లో 16,940 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది. నాలుగు రోజుల క్రితమే 9,168 గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. ఇప్పుడు మరో 16, 940 ఉద్యోగాలకు మూడు రోజుల్లో అనుమతి ఇవ్వనున్నట్టు సర్కారు ప్రకటించింది.

రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలు, భర్తీలపై వివిధ శాఖల ఉన్నతాధికారులు, టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌తో కలిసి సీఎస్ సోమేశ్ కుమార్ భేటీ అయ్యారు. ఇప్పటి వరకు 60 వేల 929 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చిందని సోమేశ్ కుమార్ వెల్లడించారు. కాగా.. మరో 16 వేల 940 పోస్టులకు మూడు రోజుల్లో అనుమతులు వస్తాయన్నారు. అయితే.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసే దిశలో ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది.

ఉద్యోగాల నియామ‌క ప్ర‌క్రియ వేగంగా పూర్త‌య్యేలా చూడాల‌న్నారు. అధికారులు గ‌డువులు నిర్దేశించుకొని ప‌ని చేయాల‌ని సూచించారు. వ‌చ్చే నెల‌లో నోటిఫికేష‌న్లు ఇచ్చేలా వివ‌రాలు అందించాల‌ని ఆయా శాఖ‌ల ఉన్న‌తాధికారుల‌ను సీఎస్ ఆదేశించారు.

Related posts

Winter Season : తెలంగాణలో ప్రజలను వణికిస్తున్న చలి..

Hardworkneverfail

Bandi Sanjay: ముగిసిన ప్రజా సంగ్రామ యాత్ర.. భావోద్వేగానికి గురైన బండి సంజయ్

Hardworkneverfail

CM KCR: ఢిల్లీలో సీఎం కేసీఆర్.. నేడు ప్రధాని మోడీ, పలువురు కేంద్రమంత్రులతో భేటీ

Hardworkneverfail

కేంద్ర, రాష్ట్ర సర్కార్‌లు రైతులను మోసం చేస్తున్నాయి: రేవంత్‌ రెడ్డి

Hardworkneverfail

CM KCR: రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చేస్తే.. ఊరుకోం.. పోరాడతాం.. సీఎం కేసీఆర్

Hardworkneverfail

దళితబంధు పథకాన్ని కూడా కేసీఆర్‌ అటకెక్కిస్తారేమో.. డీకే అరుణ విమర్శలు..

Hardworkneverfail