Bright Telangana
Image default

Waltair Veerayya : వీరయ్య లుక్ తో ఫ్యాన్స్ లో పూనకాలు లోడింగ్..

Waltair Veerayya movie poster

Waltair Veerayya Movie : మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సంక్రాంతికి విడుదల కాబోతుంది. తాజాగా విడుదల అయిన పూనకాలు లోడింగ్ పాట ట్రెండ్ అవుతోంది. రవితేజ మరియు చిరంజీవి కలిసి రచ్చ చేసిన పూనకాలు లోడింగ్ పాట యూట్యూబ్ లో కూడా రచ్చ చేస్తూ సోషల్ మీడియాలో టాప్ లో ట్రెండ్ అవుతూ కొత్త సంవత్సరంను మెగా ఫ్యాన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేసేలా చేసింది.

ఇక వాల్తేరు వీరయ్య మూవీ నుండి కొత్త సంవత్సరం కానుకగా ఈ పోస్టర్ వచ్చింది. పోస్టర్ లో చిరంజీవిని చూస్తూ ఉంటే ఇరవై ఏళ్ల క్రితం ఆయన మూవీ  ఆయనను చూసినట్లుగానే ఉంది అంటూ అభిమానులు తెగ మురిసిపోతున్నారు. పోస్టర్స్ లో చిరంజీవి వయసు ఇరువై నుండి ముప్పై ఏళ్లు తగ్గినట్లుగా అనిపిస్తుందని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఆకట్టుకునే వాల్తేరు వీరయ్య మూవీ పాటలకు తోడు ఇప్పుడు ఈ పోస్టర్ అంతకు మించి అన్నట్లుగా ఉంది. చిరంజీవి ని వీరయ్య గా ఎప్పుడెప్పుడు చూస్తామా అనిపించే విధంగా ఈ స్టిల్ ఉంది అంటూ మెగా ఫ్యాన్స్ మురిసి పోతున్నారు. ఆకట్టుకునే విధంగా ఉన్న ఈ పోస్టర్ తో సినిమా స్థాయి మరింతగా పెరిగింది.

చిరంజీవి గడ్డం.. కళ్లద్దాలు.. ఆ కాస్ట్యూమ్స్ అన్నీ భలే సెట్ అయ్యాయి. దానికి తోడు చాలా స్టైలిష్ ఫోజ్ కూడా అవ్వడంతో ఈ ఫొటోను అభిమానులు తెగ లైక్ చేస్తున్నారు. సినిమాలో కూడా ఇదే రేంజ్ లో చిరు లుక్ ఉండి.. కాస్త కథలో కంటెంట్ ఉండి కథనంలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటే వందల కోట్ల కలెక్షన్స్ వాల్తేరు వీరయ్యకు లోడింగ్ అంటూ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బాబీ దర్శకత్వంలో ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న విషయం తెల్సిందే. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. రవితేజ కూడా ఈ మూవీ లో నటించడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ మూవీ ఉంటుందని మేకర్స్ ధీమాగా చెబుతున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ మూవీ విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.

Related posts

Waltair Veerayya : పూనకాలు లోడింగ్.. వాల్తేరు వీరయ్య నుంచి మాస్ మహారాజ్ టీజర్..

Hardworkneverfail

Waltair Veerayya: పార్టీకి రెడీగా ఉండు.. మాసీవ్ స్టెప్పులతో బాసొస్తుండు!

Hardworkneverfail

Chiru with PM Modi : భీమవరం వేదికగా ప్రధాని సభకు మెగాస్టార్ కు ఆహ్వానం..

Hardworkneverfail

Waltair Veerayya : ఓటిటి లో సందడి చేస్తున్న వాల్తేర్ వీరయ్య..

Hardworkneverfail

Waltair Veerayya : ‘వాల్తేరు వీరయ్య’ గా మెగాస్టార్ చిరంజీవి.. అదిరిపోయిన టీజర్..

Hardworkneverfail

Waltair Veerayya : మెగా మాస్‌ సాంగ్‌.. పూనకాలు లోడింగ్‌..

Hardworkneverfail