Dasara Trailer : న్యాచురల్ స్టార్ నాని నటిస్తోన్న మూవీ దసరా. పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ముందుగా అందించిన అప్‌డేట్ ప్రకారం మూవీ మేకర్స్ దసరా ట్రైలర్ (Dasara Trailer)ను లాంఛ్ చేశారు. వెన్నెలొచ్చిందిరా అంటూ కీర్తిసురేశ్ పాత్ర పరిచయంతో షురూ అయింది ట్రైలర్.
ఈ మూవీలో కీర్తిసురేశ్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. సాయికుమార్, మలయాళ నటుడు షైన్ టామ్ చాకో, సముద్రఖని, జరీనా వహబ్, దీక్షిత్ శెట్టి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దసరా మూవీని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రమోషన్స్ లో ఇప్పటికే నాని టీం ఫుల్ బిజీగా ఉంది. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ డైరెక్టర్.
ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన మూడు పాటలు మ్యూజిక్ లవర్స్ ను ఇంప్రెస్ చేస్తున్నాయి. దసరా మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా తెలుగు,తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.ఈ మూవీ టీజర్ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తోంది.