Nirmala Sitharaman Sensational Comments on CM KCR : నిర్మలా సీతారామన్ తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్న ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూ. 38,500 కోట్లతో ప్రారంభమై అదనంగా లక్షా 25 వేల కోట్లకు పెంచారని విమర్శించారు. తెలంగాణ అప్పుల గురించి అడగటానికి కేంద్ర ప్రభుత్వానికి హక్కు ఉందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. తెలంగాణలో అప్పుడే పుట్టిన భాబు కూడా లక్ష రూపాయల అప్పు కట్టాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం సీలింగ్‌కు మించి రుణభారం పెరిగిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. తెలంగాణ రెవెన్యూ మిగులు బడ్జెట్ రెవెన్యూ లోటు బడ్జెట్‌గా మారిందని, ఫలితంగా రాష్ట్రం అపారమైన అప్పులు చేసిందని ఆమె పేర్కొన్నారు. భాజపా ‘పార్లమెంట్ ప్రవాస్ యోజన’లో భాగంగా జహీరాబాద్ లోక్‌సభ స్థానానికి మూడు రోజుల పర్యటనకు వచ్చిన ఆమె తొలి రోజు గురువారం కామారెడ్డిలో విలేకరులతో మాట్లాడారు.
కేసీఆర్ నేనే ప్రధాని అన్నట్లుగా దేశమంతా తిరగుతున్నారని.. దేశం మొత్తం తిరిగే ముందు మీ రాష్ట్రానికి సమాధానం చెప్పండి అని డిమాండ్ చేశారు. లిక్కర్ స్కామ్ పై ఎవరిపై ఆరోపణలు వచ్చాయో వాళ్లే సమాధానం చెప్పాలని అన్నారు. తెలంగాణలో పుట్టిన భాబుపై రూ.1.25 లక్షల అప్పు ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ కేంద్ర పథకాల పేర్లను మార్చుతుంది.. కేంద్రం ఒకటి పెడితే రాష్ట్రం ఇంకో పేరు పెడుతోందని ఆరోపించారు. కేంద్రం ప్రశ్నిస్తే విమర్శిస్తున్నారని ఆమె అన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో తెలంగాణ బలవంతంగా చేరిందని ఆమె అన్నారు.