Bright Telangana
Image default

బాయిల్డ్ రైస్ ను కొనుగోలు చేసే ప్రసక్తే లేదు: కేంద్రం స్పష్టీకరణ

PM Narendra Modi Counter To CM KCR

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వరి యుద్దం తీవ్రమవుతోంది. ఓ వైపు ధాన్యం కొనుగోలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధర్నాలు ,ఆందోళనలు చేస్తుండగా అంతే వేగంగా కేంద్రం కూడా నిర్ణయాలు తీసుకుంటుంది, ఈక్రమంలోనే కేంద్రంపై యుద్దాన్ని ప్రకటించిన సీఎం కేసిఆర్ కేంద్రానికి వార్నింగ్ ఇచ్చారు. రెండు రోజుల పాటు సమయం ఇచ్చారు. రెండు రోజుల్లో ధాన్యం కొంటారా లేదా అని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఇక ప్రతి గ్రామంలో చావు డప్పు మోగించడం ఖాయమని హెచ్చరించారు. కేంద్ర వైఖరి వల్ల దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయని అన్నారు. ఇందుకోసం ఆయన మూడు గంటల పాటు ధర్నా నిర్వహించారు.

ఇదే సమయంలో, కేంద్రం కూడా తమ వైఖరిని స్పష్టం చేసింది. బాయిల్డ్ రైస్ ను కొనుగోలు చేసే ప్రసక్తే లేదని వెల్లడించింది. దేశంలో వరిసాగు ఎక్కువైందని, ధాన్యం నిల్వలు పెరిగిపోతున్నాయని వివరించింది.

దేశ అవసరాలకు మించి వరిసాగు చేపడుతున్నారని కేంద్రం పేర్కొంది. పంట మార్పిడి అనివార్యమని పునరుద్ఘాటించింది. వరిని తక్కువగానే పండించాలని తెలంగాణకు గతంలోనూ సూచించామని తెలిపింది. ఈ నేపథ్యంలో యాసంగి పంటను కూడా పరిమితంగానే కొంటామని స్పష్టం చేసింది. రబీలో ఎంత ధాన్యం కొనుగోలు చేసేది త్వరలో చెబుతామని వెల్లడించింది.

Related posts

KTR : మోదీ ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్..

Hardworkneverfail

TRS Foundation Day : ఈ నెల 27న ఘనంగా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

Hardworkneverfail

Gun Fire : అమెరికాలో కాల్పులు.. నల్గొండ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి

Hardworkneverfail

Moinabad Farm House Deal Video : బీజేపీ గుట్టు రట్టు చేసిన సీఎం కేసీఆర్..

Hardworkneverfail

కిన్నెర వీణ కళాకారుడు ప‌ద్మ‌శ్రీ మొగిల‌య్య‌కు సీఎం కేసీఆర్ భారీ సాయం..

Hardworkneverfail

CM KCR Warangal Tour : నేటి సీఎం కేసీఆర్ వరంగల్‌ పర్యటన రద్దు..

Hardworkneverfail