Bright Telangana
Image default

IPL 2021: రాజస్తాన్‌ ఓటమి; ప్లేఆఫ్‌కు చేరువలో ఢిల్లీ !

ఐపీఎల్‌ 2021 (అబుదాబి) : ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఓటమి పాలైంది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు మాత్రమే చేయడంతో 33 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. శాంసన్‌ తన మెరుపులతో ఒంటరి పోరాటం చేసినప్పటికి… మిగతా బ్యాట్స్‌మన్‌ సహకారం కరువైంది.


ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ 10 మ్యాచ్‌ల్లో 8 విజయాలు.. రెండు ఓటములతో 16 పాయింట్లు సాధించి టాప్‌ పొజీషన్‌కు చేరుకొని ప్లేఆఫ్‌ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకుంది. మరోవైపు రాజస్తాన్‌ ఓటమితో 9 మ్యాచ్‌ల్లో 4 విజయాలు.. 5 ఓటములతో 8 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది.