Bright Telangana
Image default

Truecaller : ఫ్యామిలీ మొత్తానికి ఒకటే సబ్‌స్క్రిప్షన్‌.. ట్రూకాలర్‌ కొత్త ప్లాన్‌

Truecaller new plan - One subscription for the whole family

Truecaller New Plan : ట్రూకాలర్‌ యాప్ ఫ్యామిలీ ప్లాన్‌ పేరుతో కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌ కింద ఐదుగురు యూజర్లు ఒకేసారి ట్రూకాలర్‌ ప్రీమియం సేవలను పొందవచ్చు. ఫ్యామిలీ ప్లాన్ నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ ధర 132 రూపాయలుగా ట్రూకాలర్‌ నిర్ణయించింది.

ప్రస్తుతం ట్రూకాలర్ నెలవారీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ 39 రూపాయలు, ప్రీమియం కనెక్షన్‭కు 75 రూపాయల రుసుమును వసూలు చేస్తున్నారు. ట్రూకాలర్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌లో భాగంగా యూజర్లకు యాడ్ ఫ్రీ సేవలతోపాటు పలు రకాల కొత్త సర్వీస్‌లను అందిస్తున్నారు. స్పామ్‌ కాల్స్‌ రాకుండా అడ్డుకోవడం, ట్రూకాలర్ ప్రొఫైల్‌ ఎవరెవరు చూశారనేది తెలుసుకోవడం, ప్రీమియం బ్యాడ్జ్‌, అన్‌లిమిటెడ్‌ కాంటాక్ట్ రిక్వెస్టులు‌, ఇన్‌కాగ్నిటో మోడ్‌, కాలర్‌ అనౌన్స్‌మెంట్‌, ఘోస్ట్ కాల్స్‌ వంటివి వీటికి అదనం పొందవచ్చు.

దాంతో పాటు యాపిల్‌ వన్‌, స్పోటిఫై ఫ్యామిలీ సబ్‌స్క్రిప్షన్‌ తరహాలో ట్రూకాలర్ ఫ్యామిలీ సబ్‌స్క్రైబర్లు ఒకరి వ్యక్తిగత వివరాలను మరొకరితో పంచుకోలేరని కంపెనీ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ సేవలను అమెరికా మినహా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోని యూజర్లకు అందుబాటులో ఉన్నట్లు ట్రూకాలర్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

స్కామ్‌ కాల్స్‌ ద్వారా జరిగే మోసాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ట్రూకాలర్‌ ఫ్యామిలీ ప్లాన్‌ సబ్‌స్క్రిప్షన్‌ ద్వారా యూజర్లు తమ కుటుంబసభ్యులు, స్నేహితులకు సైబర్‌ మోసాల నుంచి భద్రత కల్పించవచ్చని ట్రూకాలర్‌ పేర్కొంది. గత నెలలో ట్రూకాల్‌ గవర్నమెంట్ డిజిటల్ డైరెక్టరీ పేరుతో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. దీనితో ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల పేరుతో జరిగే మోసాలకు సులభంగా అడ్డుకట్ట వేయొచ్చు.

Related posts

Water History : భూమి మీది నీరంతా ఎక్కడి నుంచి వచ్చింది?

Hardworkneverfail

Trending Technology : 2022-2023 కి సంబదించిన టాప్ 2 కొత్త టెక్నాలజీ ట్రెండ్‌లు

Hardworkneverfail

Jio Airfiber: దేశవ్యాప్తంగా త్వరలో జియో ఎయిర్‌ఫైబర్‌ సేవలు!

Hardworkneverfail

Wireless Electric Road : స్వీడన్‌లో ఎలక్ట్రిక్ వాహనాల కోసం వైర్‌లెస్ ఎలక్ట్రిక్ రోడ్ ఛార్జింగ్..!

Hardworkneverfail

WhatsApp New update: యూజర్స్ కి మరో అదిరిపోయే అప్డేట్ తో వాట్సాప్..!

Hardworkneverfail