Bright Telangana
Image default

Supreme Court: థియేటర్లలో బయటి ఆహారాలకు అనుమతి లేదని తీర్పు..

Supreme Court Verdict About Outside Food Is Not Allowed In Movie Theaters

Supreme Court: థియేటర్లలోకి బయటి ఫుడ్ తీసుకెళ్లే విషయంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రేక్షకులు థియేటర్లకు బయటి ఫుడ్ తీసుకురావడంపై యాజమాన్యాలు ఆంక్షలు పెట్టడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. థియేటర్లు ప్రైవేట్ ప్రాపర్టీ కావడం పట్ల యాజమాన్యం నిబంధనలు పెట్టుకోవచ్చని కోర్టు సూచించింది. శిశువుల కోసం తల్లిదండ్రులు తీసుకెళ్లే ఆహారంపై మాత్రం ఎలాంటి ఆంక్షలు పెట్టడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తెలిపింది.

ఈ మేరకు చీఫ్‌ జస్టీస్‌ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 2018లో జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ థియేటర్ యజమానులు, మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంస్థ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అప్పీళ్లను కోర్టు మంగళవారం నాడు విచారించింది.

థియేటర్లు ప్రైవేట్ ఆస్తులు అని.. వీటిలోకి తీసుకెళ్లే ఆహారాలపై నిషేధం విధించడంపై మూవీ హాళ్ల యజమానులకు పూర్తి హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ థియేటర్ లోపలకు బయటి నుంచి తినుబండారాలను అనుమతిస్తే.. తిన్నవారు తమ చేతులను కుర్చీలకు తుడిస్తే అనవసరంగా అవి పాడయ్యే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది. అయితే మూవీ థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు స్వచ్ఛమైన తాగునీరు ఉచితంగా అందించే బాధ్యత థియేటర్‌ యజమానులదేనని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.

Related posts

Samantha: నాకు ఎవరితోనూ ఎఫైర్స్‌ లేవు.. అవన్నీ రూమర్స్‌: సమంత

Hardworkneverfail

ఆర్జీవీ షాకింగ్‌ ట్వీట్‌.. దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చిన మంచు మనోజ్‌

Hardworkneverfail

Raja Vikramarka: ఏజెంట్‌ విక్రమ్‌ రెడీ

Hardworkneverfail

Pawan Kalyan-Manchu Vishnu: పవన్‌ కళ్యాణ్ vs మంచు విష్ణు.. ఎడమొఖం.. పెడమొఖం.. ఎం జరిగింది..?

Hardworkneverfail

Samantha: యూట్యూబ్ ఛానెల్స్ పై కేసు పెట్టిన సమంత…పిటిషన్ అత్యవసర విచారణకు అభ్యంతరం

Hardworkneverfail

అల్లు అర్జున్‌కు లీగల్‌ నోటీసులు పంపిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌..

Hardworkneverfail