Bright Telangana
Image default

Hyderabad : హైదరాబాద్‌లో ఉగ్ర కదలికల కేసులో సంచలన విషయాలు

Terrorist Activities In Hyderabad

Terrorist Activities In Hyderabad : హైదరాబాద్ నగరం మరోసారి ఉలిక్కిపడింది. ఉగ్ర కదలికల వ్యవహారం కలకలం రేపింది. ఉగ్ర కదలికల వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారంతో మధ్యప్రదేశ్ ఏటీఎస్, తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ నిర్వహించాయి. మహమ్మద్ సలీల్, అబ్దుల్ రెహ్మాన్, షేక్ జునైద్, మహమ్మద్ అబ్బాస్, హమీద్ ను అరెస్ట్ చేశారు.

హైదరాబాద్ లోని ఓ మెడికల్ కాలేజీలో సలీమ్ హెచ్ఓడీగా పని చేస్తున్నాడు. అబ్దుల్ రెహ్మాన్ ఎంఎన్ సీ కంపెనీలో క్లౌడ్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. షేక్ జునైద్ పాతబస్తీలో డెంటిస్ట్ గా పని చేస్తున్నాడు. మరో ఇద్దరు మహమ్మద్ అబ్బాస్, హమీద్ రోజువారీ కూలీలు. సల్మాన్ అనే కూలీ పరారీలో ఉన్నాడు. సల్మాన్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. పట్టుబడ్డ వారికి హిజ్బుత్ తహ్రీర్ సంస్థతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

హైదరాబద్ లో మరోసారి ఉగ్రకదలికలు బయటపడ్డాయి. హైదరాబాద్ కేంద్రంగా దాడులకు ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారనే సమాచారంతో మధ్యప్రదేశ్, తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. మొత్తం 16మందిని యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ అదుపులోకి తీసుకుంది. వీరిలో మధ్యప్రదేశ్ భోపాల్ కు చెందిన వారు 11 మంది, హైదరాబాద్ కి చెందిన వారు ఐదుగురు ఉన్నారు.

కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారంతో మధ్యప్రదేశ్ ఏటీఎస్, తెలంగాణ పోలీసులు భారీ ఆపరేషనర్ నిర్వహించారు. అనుమానాస్పదంగా కనిపించిన 16మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ఇస్లాం సాహిత్యం, ఎయిర్ పిస్టల్స్, పిల్లెట్స్, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 18 నెలల నుంచి హైదరాబాద్ లో నిందితులు మకాం వేసినట్లుగా అనుమానిస్తున్నారు. యువతను ఉగ్రవాదం వైపు మళ్లించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సమాచారం.

Related posts

మునుగోడు ఉప ఎన్నిక వేళ.. హైదరాబాద్ లో భారీగా హవాలా నగదు పట్టివేత

Hardworkneverfail

GHMC: కుక్కల బెడదపై జీహెచ్ఎంసీకి 36 గంటల్లో 15,000.. ఫిర్యాదుల వెల్లువ

Hardworkneverfail

Secunderabad : మూడేళ్ల తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందంటే..?

Hardworkneverfail

Bansilalpet stepwell : కళకళలాడుతున్న పురాతన కట్టడం

Hardworkneverfail

Hyderabad : నగరం నడిబొడ్డున కుంగిపోయిన రోడ్డు

Hardworkneverfail

17th Century Bansilalpet Step Well : హైదరాబాద్ లో బయటపడ్డ కళ్లుచెదిరే మెట్ల బావి..

Hardworkneverfail