Munugode Bypoll results live Updates : ఉత్కంఠ రేపిన మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో వచ్చిన ఈ ఉప ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.. అధికార టీఆర్ఎస్ పార్టీ కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని రంగంలోకి దింపితే.. ఈ సారి బీజేపీ నుంచి బరిలోకి దిగారు రాజగోపాల్‌రెడ్డి.. మరోవైపు.. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానమైన మునుగోడులో.. పాల్వాయి స్రవంతిని పోటీకి నిలిపించింది ఆ పార్టీ.. ఈ మూడు పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని అన్ని సర్వేలు చెబుతున్నాయి.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉన్నా.. ఇప్పుడు అసలైన ఫలితాలను ప్రతిక్షణం అప్‌డేట్స్ మీకోసం అందిస్తోంది ..