Bright Telangana
Image default

TRS: కేంద్రం వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ ధర్నాలు

tra party state wide dharna

తెలంగాణ: వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు.. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా మహా ధర్నాకు రంగం సిద్ధమైంది. అసెంబ్లీ నియోజకవర్గాలు, జిల్లా కేంద్రాల్లో జరిగే ఈ ధర్నా కార్యక్రమాలకు సంబంధిత జిల్లా మంత్రులతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, లీడర్లు, క్యాడర్ మొత్తం కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన తెలపనున్నారు. సీఎం కేసీఆర్‌ మినహా రాష్ట్ర మంత్రులందరూ తాము ప్రాతినిథ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజవకర్గ కేంద్రాల్లో జరిగే ధర్నాల్లో పాల్గొంటారు.

సిద్దిపేటలో హరీశ్‌రావు, సిరిసిల్లలో కేటీఆర్ హాజరు..
పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో, ఆర్థిక, వైద్య శాఖల మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట జిల్లా కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా నిర్వహిస్తారు. హైదరాబాద్‌ నగరానికి సంబంధించి పార్టీ ఎమ్మెల్యేలందరూ ఒకేచోట రైతులకు సంఘీభావంగా ధర్నాలో పాల్గొంటారు. మరో వంద అసెంబ్లీ నియోజకవర్గాల్లో రైతులతో కలిసి స్థానిక ఎమ్మెల్యేలు ధర్నాలు నిర్వహిస్తారు. ఒక్కో నియోజకవర్గంలో సుమారు 3వేల మంది చొప్పున సుమారు మూడు లక్షల మంది రైతులు శుక్రవారం జరిగే ధర్నాల్లో పాల్గొంటారని అంచనా.

శాసన మండలి స్థానిక సంస్థల కోటా ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌ మినహా మిగతా చోట్ల ఎన్నికల కోడ్‌ అమ ల్లో ఉండటంతో ధర్నాలకు అనుమతి కోరుతూ సంబంధిత నియోజకవర్గాలకు చెందిన టీఆర్‌ఎస్‌ నేతలు ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకున్నారు.

Related posts

టీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Hardworkneverfail

Huzurabad By Election: రసవత్తరంగా మారిన హుజూరాబాద్‌ ఉపఎన్నిక

Hardworkneverfail

అన్ని భాషల్లాగే హిందీ ఒకటి : మంత్రి కెటిఆర్

Hardworkneverfail

CM KCR: ధాన్యం కొనుగోలుపై ప్రధాని మోదీకి లేఖ రాసిన సీఎం కేసీఆర్

Hardworkneverfail

Telangana Liberation Day : ఇన్నాళ్లూ ఏ ప్రభుత్వం సాహసించలేదు: అమిత్‌ షా

Hardworkneverfail

CM KCR- CM Jagan : జల వివాదం తర్వాత తొలిసారి.. పెళ్లిలో కలిసిన తెలుగు రాష్ట్రాల సీఎంలు

Hardworkneverfail