Bright Telangana
Image default

CM KCR- CM Jagan : జల వివాదం తర్వాత తొలిసారి.. పెళ్లిలో కలిసిన తెలుగు రాష్ట్రాల సీఎంలు

పెళ్లిలో కలిసిన తెలుగు రాష్ట్రాల సీఎంలు

తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రా సీఎం జగన్ హైదారాబాద్‌లో కలుసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనవరాలు స్నిగ్ధారెడ్డి పెళ్లి వేడుక ఇందుకు వేదిక అయింది. ఇరువురు సీఎంలు ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యి.. వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఒకరినొకరు పలకరించించుకున్న సీఎంలు.. పక్కపక్కనే కూర్చున్నారు.

జల వివాదాల తర్వాత సీఎంలిద్దరూ ఒకే వేదికపై కనిపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ పక్కపక్కనే కూర్చుని చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. శంషాబాద్ కొత్తగూడలోని వీఎన్ఆర్ ఫామ్స్‌లో ఆదివారం అంగరంగ వైభవంగా స్నిగ్ధారెడ్డి వివాహం జరిగింది. ఏపీ సీఎం జగన్ వద్ద ప్రత్యేకాధికారిగా పని చేస్తున్న కృష్ణమోహన్ రెడ్డి కుమారుడైన రోహిత్ రెడ్డితో స్నిగ్ధారెడ్డి మూడు ముళ్లు వేయించుకున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ నుంచి సీఎం జగన్‌తో పాటు స్పీకర్ తమ్మినేని, డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి తదితరులు హాజరు అయ్యారు. ఇక హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు పలువురు ప్రముఖులు ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు. వైఎస్ విజయలక్ష్మి కూడా ఈ వేడుకకు హాజరు కావడం విశేషం.

Related posts

Bandi Sanjay: ముగిసిన ప్రజా సంగ్రామ యాత్ర.. భావోద్వేగానికి గురైన బండి సంజయ్

Hardworkneverfail

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవం

Hardworkneverfail

Revanth Reddy: కలెక్టర్లు బానిసలంటూ ఆగ్రహం…రేపటి నుంచి జిల్లాల్లో పర్యటిస్తాం

Hardworkneverfail

Controversial Comments : అయ్యప్పస్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు

Hardworkneverfail

కేంద్ర, రాష్ట్ర సర్కార్‌లు రైతులను మోసం చేస్తున్నాయి: రేవంత్‌ రెడ్డి

Hardworkneverfail

CM KCR: రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చేస్తే.. ఊరుకోం.. పోరాడతాం.. సీఎం కేసీఆర్

Hardworkneverfail