Bright Telangana
Image default

Revanth Reddy: కలెక్టర్లు బానిసలంటూ ఆగ్రహం…రేపటి నుంచి జిల్లాల్లో పర్యటిస్తాం

revanth reddy

తెలంగాణ: సీఎం కేసీఆర్‌ ఏం చెబితే అది చేసేవారిని కలెక్టర్లుగా పిలిచేందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారని అన్నారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. కేసీఆర్ ఫాంహౌస్‌లో కలెక్టర్లు కట్టు బానిసలుగా మారి, ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. వరిని కొనుగోలు చేయకపోవడంతో గుండె పగిలి చనిపోయిన రైతు మరణాన్ని ప్రభుత్వం సహజ మరణం అనడం సిగ్గుచేటన్నారు రేవంత్‌రెడ్డి. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాల్సిన ప్రభు త్వం అది వదిలేసి మద్యం దుకాణాలకు నోటిఫికేషన్లు ఇస్తుందని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 40వేల మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. వాళ్లందరి హత్యలకు సీఎం కేసీఆరే కారణమన్నారు.

పెట్రోల్‌, డీజీల్‌పై రాష్ట్ర ప్రభుత్వం పది రూపా యలు తగ్గించాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఇంధన ధరలు తగ్గించేందుకు ప్రజా ఉద్యమాన్ని చేపడతామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రైతు సమస్యలు, వరి కొనుగోళ్లు అంశంపై రేపట్నుంచి జిల్లాల పర్యటన చేపడుతున్నట్టు రేవంత్‌ స్పష్టం చేశారు.

Related posts

హుజూరాబాద్ లో దళిత బంధు నేనే పంపిణీ చేస్తా – సీఎం కేసీఆర్

Hardworkneverfail

ఏ రాష్ట్రంపై వివక్ష లేదు.. ధాన్యం సేకరణకు దేశమంతటా ఒకే విధానం : సుధాంశు పాండే

Hardworkneverfail

Former CM Rosaiah : ప్రభుత్వ లాంఛనాలతో రోశయ్య అంత్యక్రియలు

Hardworkneverfail

బాయిల్డ్ రైస్ ను కొనుగోలు చేసే ప్రసక్తే లేదు: కేంద్రం స్పష్టీకరణ

Hardworkneverfail

Revanth Reddy : రేవంత్ రెడ్డిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

Hardworkneverfail

Minister KTR: బండి సంజయ్‌ కాదు.. తొండి సంజయ్‌..

Hardworkneverfail