Bright Telangana
Image default

PM Modi: ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన.. మూడంచెల భద్రత ఏర్పాటు

huge security arrangements in ramagundam for pm-modi tour

PM Modi Tour in Ramagundam : ఆర్ఎఫ్‌సీఎల్ (ఎరువుల ఫ్యాక్టరీ)ని ప్రారంభించేందుకు నేడు ప్రధాని మోడీ పెద్దపల్లి జిల్లాలోని రామగుండంకు విచ్చేయనున్న సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలోనే మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలు ఎస్‌పీజీ, ఎన్ఎస్‌జీ, ఎన్‌డీఆర్ఎఫ్ బలగాలను మోహరించారు. సివిల్ విభాగం నుండి 300 పోలీస్ అధికారులతో పాటు 2650 మంది పోలీస్ సిబ్బందిని రంగంలోకి దింపారు. ఇద్దరు సీపీలు, ఎనిమిది ఏసీపీల పర్యవేక్షణలో ఈ భద్రతా ఏర్పాట్లను నిర్వహించారు.

అంతేకాదు.. రామగుండం, గోదావరిఖని పట్టణాల్లో పోలీసులు అడుగడుగునా తనిఖీలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా.. పరిచయం లేని వ్యక్తులకు ఆశ్రయం ఇవ్వొద్దని ప్రజలను పోలీసులు సూచిస్తున్నారు. మరోవైపు.. ఎన్‌టీపీసీ టౌన్‌షిప్ నుండి ఆర్ఎఫ్‌సీఎల్ ప్లాంట్‌కు నేరుగా వెళ్లేందుకు ఒక ప్రత్యేక ద్వారాన్ని ఏర్పాటు చేశారు. ఈ తరుణంలోనే ఎన్టీపీసి టౌన్‌షిప్, ఆర్ఎఫ్‌సీఎల్‌లను ఎస్‌పీజీ తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆర్‌ఎఫ్‌సీఎల్ నుండి ఎన్‌టీపీసీలోని టౌన్‌షిప్‌లో జరిగే బహిరంగ సభకు మోడీ వెళ్లనున్నారు.

ఆర్ఎఫ్‌సిఎల్ ప్రారంభించిన అనంతరం.. వర్చువల్ ద్వారా కొత్తగూడెం నుంచి సత్తుపల్లి రైల్వేలైన్‌లను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత పలు జాతీయ రహదారుల విస్తరణకు గాను శంకుస్థాపనలలో మోడీ పాల్గొననున్నారు. ప్రస్తుతం ఏపీలో ఉన్న మోడీ.. మధ్యాహ్నం 12.25 గంటలకు విశాఖపట్నం ఎయిర్ పోర్టు నుంచి భారత వాయుసేన ప్రత్యేక విమానంలో తెలంగాణకు బయల్దేరుతారు. మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట్ ఎయిర్‌పోర్టు‌లో దిగి.. ఆ తర్వాత బీజేపీ స్వాగత సభలో పాల్గొంటారు.

Related posts

NIA Alert : ప్రధాని మోదీని చంపుతామంటూ మెయిల్..

Hardworkneverfail

Election Results: గుజరాత్‌లో బీజేపీ ఏడోసారి విజయఢంకా..

Hardworkneverfail

Hologram Statue of Netaji : నేతాజీ హోలోగ్రామ్ విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ‌..

Hardworkneverfail

Who compromised PM’s security? : ప్రధాని మోడీ కాన్వాయ్ ఆగడం పై రాజకీయ దుమారం

Hardworkneverfail

CM KCR Wrote a Letter to PM Modi : ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ క్యాడర్‌ రూల్స్‌పై ప్రధాని మోడీకి కేసీఆర్‌ లేఖ

Hardworkneverfail

PM Modi: ‘అగ్నిపథ్ పథకం’పై కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ..

Hardworkneverfail