Bigg Boss 5 Winner VJ Sunny : బిగ్ బాస్ సీజన్ 5 తెలుగులో సన్నీ విజేతగా, షణ్ముఖ్ జశ్వంత్ రన్నరప్ గా నిలిచాడు. బిగ్ బాస్ విజేతగా నిలిచిన సన్నీకి రూ.50 లక్షల క్యాష్, సువర్ణభూమి ఇన్ ఫ్రా డెవలపర్స్ నుంచి రూ.25 లక్షల విలువ చేసే ప్లాట్ మరియు టీవీఎస్ బైకు లభించాయి.
కాగా, బిగ్ బాస్ సీజన్ 5 విజేతగా తన పేరు ప్రకటించగానే సన్నీ ఆనందం అంతా ఇంతా కాదు. హోస్ట్ అక్కినేని నాగార్జునను పైకెత్తి తన సంతోషాన్ని వ్యక్తపరిచాడు. స్టేజ్ పైన గెంతుతూ కేరింతలు కొట్టాడు. వీజే సన్నీ ప్రస్థానం ఆసక్తికరం అని చెప్పాలి. జర్నలిస్టుగా పనిచేసిన సన్నీ ఆ తర్వాత టీవీ రంగంలో ప్రవేశించి వీజేగా అలరించాడు. అటు తర్వాత సీరియల్ నటుడిగా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.