టీ 20 ప్రపంచ కప్ 2021: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం షేక్ జాయెద్ స్టేడియంలో తొలి సెమీఫైనల్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. తొలి సెమీఫైనల్‌లో 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్ జట్టు ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ జట్టుపై విజయం సాధించడంతో న్యూజిలాండ్ T20 ప్రపంచ కప్ ఫైనల్లోకి ప్రవేశించింది. 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి న్యూజిలాండ్ 167 పరుగులు చేసింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 167 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టు అలవోకగా విజయం సాధించింది. 20 ఓవర్లలో ఇంగ్లండ్ జట్టు 4 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఓపెనర్లు జోస్ బట్లర్ 29, జానీ బెయిర్‌స్టో 13 తక్కువ పరుగులు చేసి పెవిలియన్ చేరారు. అనంతరం క్రీజులోకి వచ్చిన డేవిడ్ మలాన్, అలీ కీలక భాగస్వామ్యాన్ని అందించి ఇంగ్లండ్ టీం పోరాడే స్కోర్‌ను సాధించేందుకు తమ వంతు సహాయపడ్డారు. ఇద్దరూ కలిసి అర్థసెంచరీ భాగస్వామ్యం అందించారు. అనంతరం మలాన్ (42 పరుగులు, 30 బంతులు, 4 ఫోర్లు, సిక్స్) అర్థ సెంచరీకి 8 పరుగుల దూరంలో ఇష్ సోధి బౌలింగ్‌లో కాన్వేకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మొయిన్ అలీ 51(37 బంతులు, 3 ఫోర్లు, 2 సిక్సులు) అర్థ సెంచరీతో ఇంగ్లండ్ టీం భారీ స్కోర్ చేసేందుకు తోడ్పాడ్డాడు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌతీ, మిల్నే, సొధి, నీషం చెరో వికెట్ పడగొట్టారు.
New Zealand are in the final of the #T20WorldCup 2021 🎉#ENGvNZ | https://t.co/zXAsuGVcjZ pic.twitter.com/2PKjPlgTLX
— T20 World Cup (@T20WorldCup) November 10, 2021