Bright Telangana
Image default

Waltair Veerayya Review: ‘వాల్తేరు వీరయ్య’ పూనకాలు తెప్పించిందా..!

Waltair Veerayya Review

Waltair Veerayya Review : ‘ఆచార్య’, ‘గాడ్ ఫాదర్’ మూవీస్ ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో మెగా అభిమానుల ఆశలన్నీ ‘వాల్తేరు వీరయ్య’ మూవీ పైనే ఉన్నాయి. యువ దర్శకుడు బాబీ ఈ మూవీని తీయడం, రవితేజ కీలక పాత్రను పోషించడం మూవీపై అంచనాలను పెంచింది. శృతి హాసన్ హీరోయిన్ గా, రవితేజ, క్యాథరీన్ త్రెసా, బాబీ సింహ ముఖ్య పాత్రల్లో.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ అయింది. ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి ఈ మూవీపై. ఇక పాటలు, ట్రైలర్స్ చూసిన తర్వాత మూవీపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. మరి సంక్రాంతికి వచ్చిన ఈ మూవీ (Waltair Veerayya Review) ఎలా ఉంది? ‘వాల్తేరు వీరయ్య’గా చిరంజీవి వింటేజ్‌ మాస్‌ లుక్‌లో ఏ మేరకు మెప్పించారు?

క‌థేంటంటే : ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ (బాబీ సింహా)ని అనుకోకుండా ఒక పల్లెటూరి స్టేషన్ లో ఒక రాత్రి ఉంచాల్సి వస్తుంది. ఆ క్రిమినల్ తన మనుషులతో కలిసి ఆ స్టేషన్ లో ఉన్న పోలీసులందరని చంపేసి తప్పించుకుంటాడు. దీంతో ఆ స్టేషన్ హెడ్ జాబ్ పోవడం, తన తోటి పోలీసులని చంపేశాడన్న కోపంతో జాబ్ పోయినా అతన్ని ఎలాగైనా పట్టుకోవాలని ఓ పోలీసు(రాజేంద్రప్రసాద్) లోకల్ రౌడీ అయిన వాల్తేరు వీరయ్య(మెగాస్టార్ చిరంజీవి) సహాయం కోసం వస్తాడు. డబ్బులకోసం చిరంజీవి ఈ పనిని ఒప్పుకొని అతన్ని పట్టుకోవడానికి మలేషియా వెళ్తారు. ఇక అక్కడి నుండి కథ మొదలవుతుంది. మలేషియాలో శృతి హాసన్ తగలడం, శృతి తో చిరు రొమాన్స్, పక్కన ఉన్న కమెడియన్స్ కామెడీతో సాగిపోతుంటే శృతి హాసన్ ఓ ట్విస్ట్ ఇస్తుంది. ఇక బాబీ సింహానే వీళ్ళని పట్టుకుంటాడు. అప్పుడు ట్రైలర్ లో చూపించిన డైలాగ్.. మీ కథలోకి నేను రాలేదు, నా కథలోకి మీరు వచ్చారు అని ఓ ట్విస్ట్ ఇచ్చి బాబీ సింహాని చిరంజీవి చంపేస్తాడు. ఈ యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగుంటుంది. ఇంటర్వెల్ కి మంచి ఊపు ఇచ్చి వదిలేస్తాడు డైరెక్టర్.

ఇక ఇంటర్వెల్ నుంచి ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు చిరు. ఇంటర్వెల్ నుంచి రవితేజ ఎంట్రీతో ఓపెనింగ్ చేస్తాడు. వైజాగ్ లో సముద్రంలో చేపలు పట్టుకునే వాళ్లకి లీడర్ అయిన వాల్తేరు వీరయ్య, అతని చుట్టూ ఉండే బ్యాచ్ కామెడీ, రవితేజ పోలీస్ కావడంతో అతనితో గొడవలు, చిరంజీవి కామెడీ ఫుల్ గా ఉంటుంది. అయితే ఓ వ్యక్తి చిరంజీవిని మోసం చేస్తూ ఓ పని చేస్తుండగా కొంతమంది పిల్లలు చనిపోతే ఆ నేరం చిరంజీవి మీద పడితే అప్పుడు ఏం జరిగింది? చిరంజీవి జైలు నుంచి ఎలా బయటకి వచ్చాడు? రవితేజకి, చిరంజీవి మధ్య ఉన్న సంబంధం ఏంటి? క్యాథరీన్ చిరంజీవికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరకు చిరంజీవి ఎందుకు మలేషియా వెళ్ళాడు? మోసం చేసిన వ్యక్తి (విలన్)ని పట్టుకున్నాడా? చిరంజీవి అనుకున్నది నెరవేర్చాడా? తన తమ్ముడు ఎవరు ? అతనికి ఏం మాట ఇచ్చాడు? ఆ మాట నెరవేర్చాడా? అనేది తెరపై చూడాల్సిందే.

మూవీ మొదటి నుంచి కూడా ఒకప్పటి చిరంజీవిని చూపించారు. చిరంజీవి పాత సినిమాల్లో కామెడీ ఎలా ఉండేదో దాన్ని మెయింటైన్ చేశాడు. ఓ పక్క కామెడీ చూపిస్తూనే బాస్ కి మాస్ ఎలివేషన్స్ ఓ రేంజ్ లో ఇచ్చాడు దర్శకుడు. ఇక చిరంజీవి, రవితేజ సన్నివేశాలు అన్నీ బాగుంటాయి. వాళ్ళ ఫైట్స్, కామెడీ, డైలాగ్స్ అన్నీ బాగా రాసుకున్నారు. రాజేంద్రప్రసాద్ తో మొదలైన ఈ కథ మధ్యలో ట్విస్టులతో బాగానే సాగుతుంది. ఇక యాక్షన్ సీక్వెన్స్ చాలా కొత్తగా ఉంటాయి. ఇంటర్వెల్ ఫైట్ మాత్రం అదిరిపోతుంది. శృతి హాసన్ తో చిరంజీవి ఫైట్ బాగుంటుంది. జంబలకడి జారు మిఠాయి.. లాంటి సోషల్ మీడియాలో వైరల్ అయిన సాంగ్స్, కోపదారి మనిషి లాంటి డైలాగ్స్ బాగానే వాడుకున్నారు. సెకండ్ హాఫ్ లో ఎమోషన్ తో చిరంజీవి, రవితేజ ఏడిపిస్తారు కూడా. దర్శకుడు బాబీ చిరంజీవి ఫ్యాన్ కావడం, రవితేజ తనకి లైఫ్ ఇవ్వడంతో త ఇద్దరి హీరోల్ని చాలా చక్కగా డీల్ చేశాడు. ఇద్దరికీ మంచి ఎలివేషన్స్ ఇవ్వడంతో థియేటర్స్ అభిమానుల కేరింతలతో దద్దరిల్లిపోతున్నాయి. సాంగ్స్ కి స్క్రీన్ స్పేస్ కరెక్ట్ గా సరిపోవడంతో థియేటర్స్ లో పాటలు ఎంజాయ్ చేస్తారు. సెకండ్ హాఫ్ లో మాత్రం ఒక సాంగ్ అక్కర్లేకపోయినా పెట్టినట్టు ఉంటుంది. క్యాథరీన్ కూడా మంచి పాత్రలో మెప్పించింది.

మొత్తానికి పండక్కి చాలా రోజుల తర్వాత చిరంజీవి తన వింటేజ్ మాస్ లుక్, కామెడీ, యాక్షన్ తో వచ్చి అభిమానులనే కాక ప్రేక్షకులని కూడా అలరిస్తున్నాడు. గత పండగ దసరాకి గాడ్ ఫాదర్ లో సైలెంట్ మాస్ ఎలివేషన్స్ తో వచ్చి హిట్ కొట్టి ఇప్పుడు పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మూవీతో వచ్చి హిట్ కొట్టాడు. ఈ మూవీ చూశాకా 80, 90 దశకాల అభిమానులకి పాత చిరంజీవి గుర్తురావడం ఖాయం.

Related posts

Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’ ట్రైలర్‌.. పూనకాలు లోడింగ్‌ అంటే ఇదేనేమో!

Hardworkneverfail

Waltair Veerayya : పూనకాలు లోడింగ్.. వాల్తేరు వీరయ్య నుంచి మాస్ మహారాజ్ టీజర్..

Hardworkneverfail

Waltair Veerayya: పార్టీకి రెడీగా ఉండు.. మాసీవ్ స్టెప్పులతో బాసొస్తుండు!

Hardworkneverfail

Mega 154 : మెగాస్టార్‏తో మాస్ మాహారాజా.. షూటింగ్‏లో రవితేజ.. వీడియో అదిరిపోయిందిగా..

Hardworkneverfail

Dhamaka Trailer: ధమాకా ట్రైలర్.. ఎగ్జాంపుల్ సెట్ చేశానంటోన్న రవితేజ!

Hardworkneverfail

Boss Party Song : భలేగా ‘వాల్తేరు వీరయ్య’ ‘బాస్ పార్టీ’సాంగ్ !

Hardworkneverfail