Mass Maharaja Joins Mega154 : మెగాస్టార్ చిరంజీవి తదుపరి ప్రాజెక్ట్ శరవేగంగా సెట్స్ పైకి వెళ్లడంతో టాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ద్వారా ‘మెగా 154’ అని తాత్కాలికంగా టైటిల్ పెట్టారు, ఇందులో ‘మాస్ మహారాజా’ రవితేజ కూడా సుదీర్ఘమైన పాత్రను పోషిస్తున్నారు. హైపర్ యాక్టివ్ స్టార్ మెగా స్టార్ షూట్‌కి జాయిన్ అవ్వడంతో మూవీ సెట్స్‌పై ఎనర్జీ స్పష్టంగా కనిపిస్తోంది.
వీడియోలో రవితేజ తన కారు సెట్‌లోకి ప్రవేశించడం, చిరంజీవిని విష్ చేయడం, ఆపై కారవాన్‌లోకి ప్రవేశించడం వంటివి చూపుతున్నాయి. అన్నయ్య అని రవితేజ చెప్పగానే, చిరు రిప్లైగా, హాయ్ బ్రదర్, వెల్‌కమ్ అన్నారు. చివరగా, బాబీ ‘మెగా మాస్ కాంబో బిగిన్స్’ అని ధృవీకరించాడు.
మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అయిన దర్శకుడు బాబీ రవితేజ ‘బలుపు’ మూవీకి స్క్రిప్ట్ అందించి ‘పవర్’ మూవీ తో బ్లాక్ బస్టర్ నోట్‌తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తన ఫేవరెట్ స్టార్, తొలి మూవీ హీరోతో ఒకే ప్రాజెక్ట్‌లో పనిచేయడం దర్శకుడి కల కంటే తక్కువ కాదు. ఈ మూవీ తమ ఇద్దరి అభిమానులను ఉర్రూతలూగించేలా చూసుకుంటున్నాడు.
అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ మూవీని నిర్మిస్తుండగా, జికె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
మెగా 154 మూవీకి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఎడిటర్‌గా నిరంజన్ దేవరమానె, ప్రొడక్షన్ డిజైనర్‌గా ఎఎస్ ప్రకాష్ పని చేస్తున్నారు. సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్.
బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందించారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో హరి మోహన కృష్ణ మరియు వినీత్ పొట్లూరి కూడా ఉన్నారు.
2023 సంక్రాంతి సందర్భంగా మెగా 154 ప్రేక్షకుల ముందుకు రానుంది.