Bright Telangana
Image default

Godse Teaser : మీకు వందల వేల లక్షల కోట్లు ఎలా వస్తున్నాయి.. ‘గాడ్సే’ టీజర్

godse teaser released by mega star chiranjeevi

Godse Teaser Released By Mega Star Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి.. యంగ్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నటించిన గాడ్సే మూవీ టీజర్‌ను విడుదల చేశారు. నటీనటులు సత్యాదేవి, ఐశ్వర్య లక్ష్మి, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ, సిజ్జు మీనన్, నాగబాబు, పృధ్వీ రాజ్, వర్గీస్, నోయెల్ సీన్, చైతన్య కృష్ణ, ప్రియదర్శి, గురు చరణ్, పవన్ సంతోష్ ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఈ మూవీ టీజర్ లింక్ ను షేర్ చేస్తూ.. హీరో సత్యదేవ్, దర్శకుడు గోపి, సినిమా నిర్మాత సి కళ్యాణ్ లను అభినందించారు.

గాడ్సే టీజర్ విషయానికొస్తే.. ‘గాడ్సే’ పాత్రలో నటిస్తున్న సత్య దేవ్ అవినీతి అరికట్టాలనే లక్ష్యంతో ఉన్న యువకుడిగా చూపించారు. ఇక మూవీ టీజర్ లో ‘ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకోనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు’ అంటూ గాడ్సే’ టీజర్ స్టార్ట్ కాగా ‘సాధారణంగా ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి, వ్యాపారం చేస్తే డబ్బులు వస్తాయి, వ్యవసాయం చేస్తే డబ్బులు వస్తాయి.. కానీ సేవ చేస్తున్నందుకు మీకు వందల వేల లక్షల కోట్లు ఎలా వస్తున్నాయి ? ఎందుకంటే మీరంతా సర్వీస్ పేరుతో పబ్లిక్ మనీ లూటీ చేస్తున్నారు’ అంటూ సత్యదేవ్ చెప్పే డైలాగ్ బాగుంది.

ఇక ‘గాడ్సే’ మూవీని గోపి గణేష్ పట్టాభి దర్శకత్వం వహించగా, సి కె స్క్రీన్స్ బ్యానర్‌పై సి కళ్యాణ్ నిర్మించారు. ఈ మూవీ జనవరి 26, 2022న వెండితెరపైకి రానుంది.

Related posts

Megastar Chiranjeevi: మెగాస్టార్ నోట ‘రంగ మార్తాండ’ షాయరీ

Hardworkneverfail

God Father : ఓటీటీలో దుమ్ములేపుతున్న మెగాస్టార్ ‘గాడ్‌ఫాదర్’ మూవీ..!

Hardworkneverfail

Waltair Veerayya : ఈ పాట ఎలివేషన్స్ కా బాప్..

Hardworkneverfail

Waltair Veerayya Review: ‘వాల్తేరు వీరయ్య’ పూనకాలు తెప్పించిందా..!

Hardworkneverfail

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్ఠాత్మక పురస్కారం ప్రకటించిన కేంద్రం

Hardworkneverfail

Waltair Veerayya : ఓటిటి లో సందడి చేస్తున్న వాల్తేర్ వీరయ్య..

Hardworkneverfail